పస్రాలో ఎమ్మెల్యే సీతక్క కు ఘన స్వాగతం
== కాంగ్రెస్ పార్టీ నాయకులు…
== దళితులతో కలసి డప్పు కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.
తాడ్వాయి, డిసెంబర్ 24 (విజయం న్యూస్):-
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఘన స్వాగతం లభించింది. గోవిందరావుపేట మండల పస్రా గ్రామంలో శనివారం పి.ఎస్.ఆర్.గార్డెన్స్ యందు ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ ఆధ్వర్యంలో దళిత కాంగ్రెస్, దళితుల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించగా ఇట్టి సమావేశానికి ముఖ్య అతిధులుగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క హాజరు కాగా, దళితులందరు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో, డ్యాన్సులతో, కోలాటాలతో దళితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన సీతక్క మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు సాగుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ
ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క , రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు నగరిగరి ప్రీతం మాట్లాడుతూ దళిత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేసిందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆరోజున కాంగ్రెస్ పార్టీ ప్రపంచ విజ్ఞాన వంతుడు అయిన అంబేద్కర్ గారిని ప్రోత్సహించి దేశ న్యాయ శాఖ మంత్రిగా పదవులను ఇచ్చి అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసే స్వేచ్చను ఇచ్చి అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. అలాగే దేశంలో ఆర్థిక పంచవర్ష ప్రణాళికలు, సాగునీటి ఆయాకట్టలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గృహ కల్పన, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం, పంట రుణాలు అందించి రైతులను, విద్యార్థులను, బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాగే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, కొత్త పంట రుణాలు ఇవ్వకుండా, ఇంధన ధరలు పెంచి, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని అన్నారు. తెరాస ప్రభుత్వం కూడా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని గద్దెను ఎక్కాడని అన్నారు. అలాగే వెంటనే కేసీఆర్ గారు దళితులకు ఇస్తానన్న హామీలు నెరవేర్చాలి అని అన్నారు. దళిత బంధు పథకం కూడా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అందించాలని అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నదని, రాష్ట్రంలో అక్కరకు రాని పథకాలు, నిర్దిష్ట పరిమితి లేని పథకాలతో రాష్ట్రం అప్పులకూబిలో చిక్కుకుపోయిందని అన్నారు. ఒక పక్క దేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నాడని అన్నారు.
ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్
దళితుల మీద గౌరవంతోనే కాంగ్రెస్ పార్టీ దేశానికి అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే దేశ అధ్యక్షుడిగా నియమించింది అని అన్నారు. దేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలంటే కాంగ్రెస్ రావాలని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల జనవరి నుండి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ప్రజలందరి గుండెల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు ఉన్నాయని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా అందరూ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి పుల్ల అనిల్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు మల్లాది రాంరెడ్డి, ఎస్.సి.సెల్ రాష్ట్ర కన్వీనర్ దబ్బెట రమేష్, వర్షం అశోక్, బొద్దు అనిల్ కుమార్, డాక్టర్ చేకూరి చిరంజీవి,ఎస్.సి.సెల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పెరుమల్ల రామకృష్ణ, నడికూడా వెంకట్, దండు రమేష్, గొల్లపెల్లి రంజిత్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,
ఇది కూడా చదవండి: తుమ్మల వ్యూహమేంటీ..?
మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి.ఆయుబ్ ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, బై రెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు జిల్లా మండలాల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, రసపుత్ సీతారాంనాయక్, బండి శ్రీనివాస్, జాలపు అనంత రెడ్డి, ఎండి. అఫ్సర్ పాషా, చిటమట రఘు, మైల జయరాం రెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధీకొండ కాంతారావు, ములుగు జిల్లా ఎస్.సి.సెల్ మండలాల అధ్యక్షులు పడిదల సాంబయ్య, మట్టేవాడ తిరుపతి, మైస ప్రభాకర్, వావిలాల రాంబాబు, సునార్కని రాంబాబు, కర్నే సత్యం, పల్లికొండ యాదగిరి, సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్, ఎంపీపీ జాడి సమ్మక్క- రాంబాబు, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, గ్రామ అధ్యక్షుడు బద్దం లింగారెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, దేపాక కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.