Telugu News

పొట్ల నాగేశ్వరరావుకి అడుగడుగున ఘన స్వాగతం

6 వేల మందితో భారీగా  తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

0

పొట్ల నాగేశ్వరరావుకి అడుగడుగున ఘన స్వాగతం

== 6 వేల మందితో భారీగా  తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

== డప్పులు, కోలాటం, గిరిజన నృత్యాలు చేస్తూ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

 

== మహిళలు హారతి ఇచ్చి అపూర్వ స్వాగతం పలికారు

== కొత్తగూడెం గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని నినదించిన కాంగ్రెస్ శ్రేణులు

(భద్రాద్రికొత్తగూడెంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియమితులై మొదటి సారి కొత్తగూడెం నియోజకవర్గం విచ్చేసిన పొట్ల నాగేశ్వరరావుకి కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి అఖండ స్వాతం పలికారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు ప్రత్యేకంగా మహిళలు హారతి ఇచ్చి అపూర్వ స్వాగతం పలికారు. డప్పులు, కోలాటం, గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ, పొట్ల నినాదాలతో కొత్తగూడెం పట్టణ బజార్లు మార్మోగాయి. ర్యాలీని ఉద్దేశించి పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై అపార నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్న మిగితా నాలుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, రాబోయే ఎన్నికలలో కార్యకర్తలు అంతా కష్టపడి రాష్టంలో,కేంద్రం లో అధికారంలోనికి తీసువచ్చేందుకు కృషి చేయాలని,జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బాలశౌరి, ధర్మరావు, నాగసీతారాములు తదితరులు హాజరైయ్యారు. 

ALLSO READ- షర్మిల టీమ్ కు ఏమైంది