Telugu News

46 డివిజన్లో నామా గెలుపు కోసం విస్తృత ప్రచారం

ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ

0

46 డివిజన్లో నామా గెలుపు కోసం విస్తృత ప్రచారం

== ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ

(ఖమ్మం -విజయం న్యూస్)

స్థానిక 46 డివిజన్లో ఖమ్మం పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి గెలుపును కాంక్షిస్తూ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ ఆధ్వర్యంలో brs పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు లో తెలంగాణ గళాన్ని వినిపించే ఏకైక పార్టీ brs పార్టీ అని వారు తెలిపారు. నామా నాగేశ్వరరావు గారు ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారని , పార్లమెంటు లో తెలంగాణ బిల్లు కొరకు మొదటి ఓటు వేసి మద్దతు తెలిపిన నాయకుడిగా నిలిచారని వారు తెలిపారు.

ఇది కూడా చదవండి:- అయ్యప్ప స్వామి టెంపుల్ లో నామ  పూజలు
సారధి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు టెండర్ అయ్యేలా కృషి చేసారు. నామా గారు జాతీయ రహదారులను ఖమ్మంకు మంజూరు చేయించారని, రానున్న కాలంలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 46 డివిజన్ అధ్యక్షుడు బొల్లెపల్లి విజయ్, కార్యదర్శి బాల్దే నాగేశ్వర రావు , నగర brs పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తొగరు భాస్కర్ నాయకులు కనకం భద్రయ్య, గోధుమల శ్రీనివాస్ , అజ్జు , కన్నం రమేష్ ,మిట్టపల్లి శ్రీనివాస్ , మల్యాల భిక్షపతి, జాని, డోకుపర్తి నాగేశ్వర రావు, శ్యామ్ డేవిడ్, గోనెల సునిత, వేముల విజయ్, మోటె జగదీష్ , కడగంచి అశోక్, మరియు తదితరులు పాల్గొన్నారు.