Telugu News

అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య: సీఐ మురళీ

బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో 2022లో జరిగిన సంఘటన.

0

అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య: సీఐ మురళీ

★ నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ 

★ బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో 2022లో జరిగిన సంఘటన.

(బోనకల్ -విజయంన్యూస్)

అక్రమ సంబంధంతో భర్తను ప్రియుడితో కలిసి చంపిన ఘటన బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో జరిగింది. అక్టోబర్ 2022 గుమ్మ నాగరాజు అనే వ్యక్తిని భార్య ఆమె ప్రియుడితో కలిసి మద్యం లో పురుగులు మందు కలిపి తాగించారు. నోటి నుండి నురగరావడంతో ఏమీ తెలియనట్లు ఆర్.ఎం.పి దగ్గరకు తీసుకువెళ్లారు అతడు పరీక్షించి ఖమ్మం తీసుకు వెళ్ళమని చెప్పగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడంతో అది సహజ మరణం కాదని అనుమానం కలిగింది. పోస్టుమార్టం రిపోర్ట్ ను ల్యాబ్ పంపగా ఆహారంలో విషం కలిపినట్లు రిపోర్టు రావడంతో దానిపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితులు ఉమా రాంబాబు సంఘటన జరిగిన నెల రోజులు నుండి కనిపించకుండా పోయారు. అప్పటి నుండి వారి ఆసుకి కోసం గాలిస్తుండగా శుక్రవారం రాంబాబు గ్రామంలోకి వచ్చినట్లు సమాచారం రావడంతో వెళ్లి అతను అదుపులోకి తీసుకున్నట్లు మధిర సీఐ మురళి తెలిపారు. తమ అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో చంపినట్లు నేరం అంగీకరించడంతో నిందితులను రిమాండ్ కి పంపించినట్లు వారు తెలిపారు.

ఇది కూడా చదవండి: పాలేరుకు మీరే పోటీ చేయాలని కోరిన యువకులు