విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్
లాంగ్ జంఫ్ లో స్వర్ణం, 100 పరుగుల రన్నింగ్ లో రజతం సాధించిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె
విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్
== లాంగ్ జంఫ్ లో స్వర్ణం, 100 పరుగుల రన్నింగ్ లో రజతం సాధించిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె
== అభినందనలు అందుకుంటున్న కృతిక
(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్)
పదేళ్ల చిన్నారి.. తండ్రి చనిపోయి మూడు రోజులు కాలేదు.. ఇంతలో క్రీడా పోటీలు రానే వచ్చాయి.. పోవాలా వద్దా..? తీసుకెళ్లాలా..? వద్దా..? ఏదేమైనకానీ.. అనుకున్నది సాధించాలి అని కుటుంబ సభ్యులు భావించారు.. తండ్రి ఆశయాన్ని నేరవేర్చాలని తలంచిన కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రోత్సహించారు.. పరుగుల రేస్ కు పంపించారు… ఇక అంతే.. తండ్రి ఆశయాన్ని బలంగా పులుముకున్న ఆ చిన్నారి పరుగుల రేస్ లో పతకం సాధించింది.. జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.. కన్నీటి విషాదంలోను విజేతగా నిలిచింది.. ఆ చిన్నారి మనోధైర్యం ముందు ఓటమి తల వంచింది.
ఇది కూడా చదవండి: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడు గ్రామంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస్ హత్యకు గురైన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.. అందరినీ కదిలించింది. ఆ ఘటనతో ఆయన కటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. వారు రోదిస్తున్న దృశ్యాలు చూసిన ప్రతిఒక్కరి హృదయాలు బరువెక్కాయి. ఆ విషాదం ఇంకా రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి చెరిగిపోలేదు. ఆయన కుటుంబం ఇంకా తేరుకోలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్వో సీహెచ్ శ్రీనివాసరావు ఈ నెల 22న గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. తండ్రి ప్రోత్సాహంతో అథ్లెటిక్స్ లో తన పెద్దనాయన వద్ద శిక్షణ పొందుతున్నకుమార్తె కృతిక కొత్తగూడెం జిల్లాలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది.. దీంతో ఆ బాలికను తీసుకెళ్లాల వద్దా..? అని పెద్దనాన్న, పంపించాలా వద్దా..? అని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ఏదేమైనాప్పటికి ఆ పాపను క్రీడాపోటీలకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాప పెద్దనాయన కొత్తగూడెంలో శుక్రవారం జరిగే ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ కు తీసుకెళ్లారు. దీంతో ఆ పాప తండ్రి మాటలను గుర్తు తెచ్చుకుంది. అండర్-10 విభాగంలో లాంగ్‌జంప్‌లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, కోచ్‌లు చిన్నారి మనోస్థైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ఆమె దైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. కృతిక ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది.
ఇది కూడా చదవండి: ఖమ్మం లో మంత్రులకు నిరసన సెగ