Telugu News

మంత్రి వేదిస్తున్నారన్న మహిళా కార్పోరేటర్

నా భర్త, నా పై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ

0

మంత్రి వేదిస్తున్నారన్న మహిళా కార్పోరేటర్

== నా భర్త, నా పై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ

== వీడియో రిలీజ్ చేసిన మహిళాకార్పోరేటర్

== చట్టం ముందు అందరూ సమానమేనంటున్న పోలీసులు

== ఎవర్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదంటున్న బీఆర్ఎస్ నేతలు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమను వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కి చెందిన 54వ డివిజన్ మహిళా కార్పోరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె మీడియాకు విడుదల చేశారు. మంత్రి పువ్వాడ, పోలీస్ అధికారి నా కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:- నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

పువ్వాడ, జగన్,  మోదిలది ఒకే విధానమని,  కేసులు పెట్టి వేధించడమే వీళ్లకు తెలుసని ఆవేదన వ్యక్తంచేశారు. నా భర్తను ఓ పోలిస్ అధికారి పార్టీ మారమని ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. ఎన్ని కేసులైన భరిస్తాం.. పువ్వాడ అజయ్ ని ఎదుర్కుంటామని కార్పోరేటర్ మంజుల నరేందర్ విడియోలో స్పష్టం చేశారు.నా కుటుంబానికి ఏదైనా జరిగితే వీరిద్దరిదే బాధ్యత అని అన్నారు. పువ్వాడ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.‌పువ్వాడ కమ్మ .. కమ్మ అని చెప్పుకుంటూ అనేక మంది కమ్మ వాళ్లను వేధిస్తున్నాడని, అజయ్ కుమార్ కోర్టు ఖమ్మం లో నడుస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి:- కడియం శ్రీహరికే ఎమ్మెల్యే రాజయ్య మద్దతు

మంత్రి పువ్వాడ నాకు ఇది చివరి ఎన్నికలంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడని, పువ్వాడకు ఇది నిజంగానే చివరి ఎన్నిక అని,  పువ్వాడ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.పోలీసులు ఇంటికొచ్చి నన్ను మహిళ అని చూడకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు మంత్రి చెప్పగానే కేసులు నమోదు చేస్తున్నారని, ఆలోచించడం లేదని ఆరోపించారు.ఓ పోలిస్ అధికారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ..

ఇది కూడా చదవండి:- రాయల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..ఏంటంటే..? 

ఇంటి వాళ్ళుగా మారాడని ఆరోపించారు.నా భర్త తప్పు చేసాడని పోలిస్ అధికార్ల వద్ద ఆధారాలు లేవని స్పష్టం చేశారు.ఆధారాలుంటే నాకు చూపెట్టాలని సూచించారు.సిసి ఫుటేజ్ తో రక్షణ కల్పిస్తామని చెప్పే పోలీసులకు నా భర్త ఉన్న వీడియో ఏదైనా దొరికిందా..? అని ప్రశ్నించారు.సెల్ టవర్ తో సిగ్నల్ లొకేషన్ తెలుస్తుంది. ఆ లోకేషన్ లో నా భర్త సిగ్నల్ ట్రేస్ అయ్యిందా ..? అని ప్రశ్నించారు.