Telugu News

బైక్ ఢీకొట్టాడని కత్తితో పొడిచిన యువకుడు

== గాయాలపాలైన మరో యువకుడు.. ఆసుపత్రికి తరలింపు

0

బైక్ ఢీకొట్టాడని కత్తితో పొడిచిన యువకుడు
== గాయాలపాలైన మరో యువకుడు.. ఆసుపత్రికి తరలింపు
(కూసుమంచి-విజయంన్యూస్)
బైక్ ఢికొట్టాడని మందలించినందుకు కక్ష్యతో ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం సాయంత్రం కూసుమంచి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూసుమంచి మండలంలోని గంగబండతండాకు చెందిన రమావత్ సురేష్,రావిచెట్టు తండాకు చెందిన బాను అనే యువకుడి మధ్య బుధవారం సాయంత్రం మోటర్ సైకిల్ ఢికొట్టిన విషయంలో చిన్న గొడవ జరిగింది.

అది కాస్త ఇద్దరు చాలెంజ్ చేసుకోని వెళ్లిపోయారు. తీరా గంట తరువాత తన మోటర్ సైకిల్ ను రిపేర్ చేయించుకుంటున్న సందర్భంలో రావిచెట్టు తండాకు చెందిన బాను కత్తితో మెడపై దాడి చేశాడు. దీంతో వెంటనే సురేష్ తేరుకోని అతన్ని నుంచి కొంచం దూరం వెళ్లడంతో స్థానికులు తక్షణమే అతన్ని నివారించారు.

also read :-పేదల అభ్యున్నతికి అంబేడ్కర్ రాజ్యాంగమే మూలం

also read :-టీఆర్ఎస్ పతనం షూరు ఖాయం

కాగా కత్తపోటుతో గాయపడిన సురేష్ ను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.