Telugu News

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడు

?పెళ్లి చేసుకుంటా అని ముఖం చాటేసిన ప్రేమికుడు

0

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడు

 

?పెళ్లి చేసుకుంటా అని ముఖం చాటేసిన ప్రేమికుడు

 

?ప్రియుడి ఇంటి ముందు బైఠాయించినా భాధితురాలు

 

?తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపనట్టున్నా యువతి

 

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

ప్రేమిస్తున్నాను అని అమ్మాయి వెంట తిరిగాడు. ముద్దు, ముచ్చట తీర్చుకొని తీరా పెళ్లి చేసుకోమని యువతి అడిగితే ముఖం చాటేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామం జరిగింది. పూర్తి వివరాల్లోకి కి వెళ్తే సారపాక గ్రామం రాజీవ్ నగర్ కాలనీ కి చెందినబోడుగడ్డ కిరణ్ కుమార్ ఇర్పా నర్మదా గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.కిరణ్ కుమార్ నర్మదను పెళ్లి చేసుకుంటానని, నమ్మించి పలుమార్లు ఆమెను శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. నర్మద మూడో నెల గర్భవతి అయిన తర్వాత గర్భాన్ని తొలగించాడని, మనం ముందు పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత సంతానం అని చెప్పి కిరణ్ కుమార్ నన్ను నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చే సరికి ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు నర్మద తన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.

also read:-మాది రైతు ప్రభుత్వం

ఈ విషయం గురించి సదరు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో మే నెల మొదటి తారీఖున ఆమె ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం శుక్రవారం నాడు సాయంత్రం గ్రామ పెద్దల సమక్షంలో పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు వాగ్వాదం చేసుకోవడంతో బాధితురాలు నర్మద సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడ ఉన్న నర్మదా బంధువులు స్థానిక బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో బాధితురాలు కుటుంబ సభ్యులు బాధితురాలితో కలిసి శనివారం కిరణ్ కుమార్ ఇంటి ఎదుట బైఠాయించారు. తన కూతురుకి కిరణ్ కుమార్ తో పెళ్లి జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని తల్లిదండ్రులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్మద కు మద్దతుగా పలు పార్టీలు మహిళ సంఘాలు స్థానికులు మద్దతు తెలుపుతున్నారు.