Telugu News

ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 121 దరఖాస్తులు

0

ఖమ్మంలో అభయ ‘హస్తం’ ఎవరికో..

== కాంగ్రెస్ లో పోటీకి భారీగా దరఖాస్తులు

== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 121 దరఖాస్తులు

== మధిరకు 2- ఇల్లందుకు 32 దరఖాస్తులు

==   స్టీరింగ్ కమిటీ చైర్మన్ ను కలిసిన పువ్వాళ దుర్గాప్రసాద్

== అభ్యర్థుల జాబితా లిస్ట్ ను అందజేసిన ఖమ్మండీసీసీ అధ్యక్షుడు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిలాలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో పోటీ చేసేందుకు అశావాహులు పోటీ పడ్డారు. రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రావడం గమనర్హం.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా, మొత్తం 121 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 60శాతం ఎస్సీ,స్టీ రిజర్వేషన్ కల్గిన వారు ఉంటే, 10శాతం బీసీలు, 30శాతం ఓసీలు ఉన్నారు. అత్యధికంగా జనాభా కల్గిన బీసీలు కేవలం 10 శాతం మంది దరఖాస్తులు చేసుకోవడం గమనర్హం. జనరల్ స్థానంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇక రాష్ట్ర సీఎల్పీ నేతగా పనిచేస్తున్న భట్టి విక్రమార్కకు కూడా పోటీ ఉంది.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క తో పాటు కోటా రాంబాబు దరఖాస్తు చేశారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

అలాగే భద్రాచలం ఎమ్మెల్యేకు కూడా పోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. భద్రాచలం నియోజకవర్గానికి మొత్తం 3 దరఖాస్తులు రాగా, పోడెం వీరయ్యతో పాటు గొండి బాలయ్య, పేర్ల క్రిష్ణబాబు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు దాదాపుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క, పోడెం వీరయ్యలకు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఇక మరో ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లికి కూడా కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడ్డరు. సత్తుపల్లిలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉండగా, ఆయన దరకాస్తు చేసుకున్నారు. ఆయనతో పాటు మరో 9మంది దరఖాస్తు చేసుకున్నారు.

== జనరల్ స్థానాలకు భారీగా దరఖాస్తులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు కూడా యమకిరాకే పలికింది. అత్యధికంగా డబ్బు రాజకీయం సాగే ఈ నియోజకవర్గంలో భారీగా దరఖాస్తులు రావడం గమనర్హం. కొత్తగూడెం నుంచి 10, పాలేరు నుంచి 14, ఖమ్మం నుంచి 9 దరఖాస్తులు వచ్చాయి. మాజీ ఎంపీ పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి ఆ మూడు నియోజకవర్గాల్లో  దరఖాస్తు చేసుకోగా, ఆయన అనుచరుడు మువ్వా విజయ్ బాబు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్నారు.

== ఇల్లందులో దరఖాస్తులను కుమ్మెసిన నాయకులు                                    ఇది కూడా చదవండి: అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

ఉమ్మడి ఖమ్మ జిల్లాలోనే ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తుగా కుమ్మేశారు. మొత్తం 32 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడం గమనర్హం. రాష్ట్ర వ్యాప్తంగా  ఒక్కోక్క నియోజకవర్గానికి సుమారు 15 దరఖాస్తులు కంటే తక్కువగానే వచ్చాయి.. కానీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఏకంగా 32 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దరఖాస్తులు చేసుకోవడం గమనర్హం. రాష్ట్రంలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చిన జాబితాలో మొదటి స్థానం సాధించింది ఇల్లెందు నియోజకవర్గం. ఆ తరువాత వైరా నియోజకవర్గానికి 15, పినపాక నియోజకవర్గాని 17 దరఖాస్తులు వచ్చాయి.

== ఎన్నికల కమిటీ చైర్మన్ ను కలిసి జాబితాను అందజేసిన డీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎంపీ. కె.మురళీధరన్ మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కు రాగా, ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.  ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అశావాహులు దరఖాస్తులు చేసుకోగా, ఆ జాబితాను సీల్డ్ కవర్ లో ఎన్నికల కమిటీ చైర్మన్ కు అందజేశారు. జిల్లా లోని అభ్యర్థుల జాబితాను సమర్పించి,జిల్లా లోని రాజకీయ పరిస్థితులను సవివరంగా వివరించారు. రాజకీయ పరిస్థితులు, 2014 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు, బలోపేతం, రాబోయే ఎన్నికల పరిస్థితులను వివరించారు.

ఇది కూడా చదవండి: తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే

== దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వీరే

1) మధిర-2 – భట్టి విక్రమార్క, కోటా రాంబాబు

2) భద్రాచలం- 3- పొడెం వీరయ్య, గోండి బాలయ్య, పేర్ల క్రిష్ణబాబు

3) కొత్తగూడెం -10 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగా సీతారాములు, ఎడవల్లి క్రిష్ణ, పోట్ల నాగేశ్వరరావు, మోత్కూరి

ధర్మారావు, కొదుమూరి శ్రీనివాస్ రావు, నునాత్ శంకర్ నాయక్, ఊకంటి గోపాల్ రావు, తోట

దేవిప్రశన్న, లక్కినేని సురేందర్ రావు,

4) సత్తుపల్లి- 10- సంభాని చంద్రశేఖర్, కోటూరి మానవత్ రాయ్, చింతమళ్ల రవికుమార్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్,

చింతపమళ్ల పద్మ, మట్టా దయానంద్ విజయ్ కుమార్, మట్టారాగమయి, కొండూరి సుధాకర్,

తోటమళ్ల నవీన్ కుమార్, బొడ్డు బొందయ్య,

5) వైరా- 15- పాలకుర్తి నాగేశ్వరరావు, మాలోతు రాందాసు నాయక్, బానోతు బాబు(అర్జున్), బానోతు బాలాజీ నాయక్, ధరావత్ రామూర్తి నాయక్,

బానోతు సైదేశ్వరరావు, లకావత్ చందర్ నాయక్, బండ్ల రాంబాబు, అంగోతు శ్రీమన్నారాయణ,

బానోతు విజయబాయి, దుంగ్రోతు వెంకటేశ్వరరావు, కుటాడి కుమార్, లకావత్ సైదులు, భూక్యా బిక్షపతి రాథోడ్, వాంకుడోతు దీపక్.

6) పాలేరు- 14 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీరామ్ యాదవ్, రాంరెడ్డి చరణ్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, బైరి

హరినాథ్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి , బెల్లం శ్రీనివాస్, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, ఎరసాని శివశంకర్

రెడ్డి, మువ్వా విజయ్ బాబు, రామసహాయం మాదవిరెడ్డి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయుడు

సత్యనారాయణ, సభావత్ రాములునాయక్

7) ఖమ్మం – 9 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరుచూరి మురళీ క్రిష్ణ, డాక్టర్ లోకేష్ యాదవ్ గంగదేవుల, మానుకొండ

రాధాకిషోర్, షేక్ చోటాబాబు, నున్నా రామక్రిష్ణ, పుచ్చకాయల వీరభద్రం, మువ్వా విజయ్ బాబు,

మహ్మద్ జావిద్

8) పినపాక – 17–  గొండి వెంకటేశ్వర్లు, కణితి బాస్కర్ రావు, దినసరి సూర్య, పాయం వెంకటేశ్వర్లు, అశు సరస్వతి,

డాక్టర్ చందా సంతోష్ కుమార్, అలేం రవికుమార్, కోమరం లక్ష్మణ్ రావు, బట్టా విజయ్ గాంధీ,

కాటిబోయిన నాగేశ్వరరావు, కణితి క్రిష్ణ, వూకే ముద్దారాజు, పాలేబోయిన శ్రీవాణి, తెల్లం

నాగేశ్వరరావు, కోమరం కాంతారావు, అనంద్ కిషోర్, డుంగ్రోతు వెంకటేశ్వరరావు,

9) అశ్వరరావుపేట- 8- తాటి వెంకటేశ్వర్లు, వీశం ప్రేమ్ కుమార్, వగ్గెల పూజ, సున్నం నాగమణి, బానోతు దంజూ,

దారబోయిన రమేష్, జారే అధినారాయణ, కట్రాం నర్సింహారావు

10) ఇల్లందు-32- బానోతు విజయలక్ష్మి, గుగులోతు కిషన్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు, తేజావత్ బెల్లయ్య నాయక్,

మాలోతు ఉదయ్ సింగ్, అజ్మీర శంకర్, భూక్యా మంగిలాల్ నాయక్, భూక్యా దల్ సింగ్ నాయక్,

కోరం కనకయ్య, పున్నం భూక్యా చంద్రకళ, మొక్కల శ్రీనివాస్ రావుదొర, భూక్యా శ్రవంతి, బానోతు

వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిగుగులోతు, డుంగ్రోతు వెంకటేశ్వరరావు, గుండేబోయిన నాగమణి, డాక్టర్

బానోతు సంజయ్ నాయక్, బానోతు వెంకట ప్రవీణ్ నాయక్, డాక్టర్ భూక్యా రామచంద్రునాయక్,

నునావత్ రాధా, సాయిశంకర్ పొరిక, కె. వెంకటేశ్వర్లు, మక్కల శ్రీనివాస్ రావు, ఇస్లావత్ లక్ష్మణ్

నాయక్, ఏ.పాపారావు, మాలతో వెంకట్ లాల్, డాక్టర్ బానోతు నాగేశ్వరరావు, శివకుమార్

అంగోతు, పెండికట్ల యాకయ్య, అంగోతు నామోదర్ నాయక్, బానోతు సోమ్లా,