Telugu News

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి:ఎంపిపి బోడ మంగీలాల్ నాయక్.

తిరుమలయాపాలెం:

0

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి:ఎంపిపి బోడ మంగీలాల్ నాయక్.

తిరుమలయాపాలెం: మండలంలోని విద్యారంగ సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీపీ బోడ మంగీలాల్ అన్నారు. మండల పరిధిలోని పలు పాఠశాలలను పరిశిలీంచి హైదరసాయిపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వఉన్నత పాఠశాలను సందర్శించి పలూ సమస్యలను పాఠశాల సిబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

also read :-బూర్గంపాడులో పెద్దపులి భయాందోళనలో జనం.

ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ మాట్లాడుతూ కరోనా కారణంగా విద్యార్థులు చాలా కాలంగా తరగతి పాఠాలకు దూరమయ్యారని, విద్యారంగ సమస్యల కోసం నిరంతరంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మౌలిక సదుపాయాల కోసం, మన ఊరు మన బడి కార్యక్రమాన్నీ నిర్వహిస్తుందనీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరకు అధిక మొత్తంలో నిధులను కేటాయించబోతుందనీ, అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార పదార్థాల అమలును పరిశీలించారు.