Telugu News

ఏసీబీ చిక్కిన హెచ్ఎం ఎం శ్రీలత

రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీలత

0

ఏసీబీ హెచ్ఎం ఎం శ్రీలత

== ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత

== రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శ్రీలత

(ఖమ్మంప్రతినిధి/మధిర-విజయంన్యూస్)

ఇప్పటి వరకు రెవెన్యూ,పోలీస్, విద్యుత్ శాఖా ఇతర శాఖాధికారులు లంచగొండులుగా చిత్రికరించిన సమాజం.. ఇప్పుడు ఆ శాఖలో మరో శాఖను చేర్చాల్సిన పరిస్థితి ఇగో ఈమె వల్ల వచ్చింది.. సమాజానికి సైనికులను, నవభారత నిర్మాణకర్తలను తయారు చేయాల్సిన గురువులు లంచావాతారం ఎత్తిన పరిస్థితి ఏర్పడింది.. తల్లిదండ్రుల తరువాత దేవునిగా పూజించే గురువులు లంచావాతారం ఎత్తుతున్నారు. అలాంటి దుర్మార్గపు పనిచేసిన ఓ ఫ్రధానోపాధ్యాయురాలును ఏసీబీ అధికారులు వల వేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై  సంతకం పెట్టేందుకు 500000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు ఈరోజు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో  ఏసీబీ  డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు

మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలి అంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు.

ఇది కూడా చదవండి: నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా