ప్రమాదవశాత్తు బైకు దగ్ధం.
వ్యక్తికి తీవ్ర గాయాలు.
కాపాడిన కానిస్టేబుల్ బాలాజీ.
(తల్లాడ విజయం న్యూస్):-
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు బైక్ కు నిప్పు అంటుకొని దగ్ధం సంఘటన చోటు చేసుకుంది. కోదాడకు చెందిన గోపాల్ రావు అనే వ్యక్తి బైక్ మీద వెళుతుండగా బైక్ లో నుంచి ఒకేసారి మంటలు చెలరేగి గోపాల్ మంటల్లో చిక్కుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ బాలాజీ ప్రాణాలు పణంగా పెట్టి రక్షించారు. వైద్యం నిమిత్తం క్షతగాత్రుడుని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
also read :- నూతన సంవత్సర వేడుక విషాదం కావద్దు.. కూసుమంచి సిఐ సతీష్ కుమార్.