Telugu News

కూసుమంచి ఏడీఈ  త్రుటీలో తప్పిన ప్రమాదం

లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు

0

కూసుమంచి ఏడీఈ  త్రుటీలో తప్పిన ప్రమాదం

** లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు

(ఖమ్మం రూరల్ -విజయం న్యూస్)

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.. కూసుమంచి ఏడీఈగా పనిచేస్తున్న కోక్యనాయక్ త్రుటిలో ప్రమాదం తప్పింది. విధినిర్వహణలో భాగంగా ఖమ్మం నుంచి కూసుమంచి వైపు కారులో వస్తుండగా తల్లంపాడు గ్రామంలో  ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగ వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ఏడీఈ కోక్యనాయక్ స్వల్పంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Allso read:- మునుగోడులో ఎమ్మెల్యే ఈటెల కాన్వాయ్ పై దాడి