ఖమ్మం బైపాస్ లో ప్రమాదం
== ఆర్టీసీ బస్సు, ట్యాంకర్ ఢీ
== ప్రయాణికులకు స్వల్పగాయాలు
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలో బైపాస్ ఎన్టీఆర్ చౌరస్తా లో పెట్రోల్ టాంకర్, ఆర్టీసీ బస్సు “ఢీ”కొట్టుకోగా, ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు..ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఏన్కూర్ నుండి ఖమ్మం బస్టాండ్ వస్తున్న పల్లె వెలుగు బస్సు వైరా నుండి వరంగల్ సైడు వెళ్లే పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి సిగ్నల్స్ వద్ద ఢీ కొన్నాయి.. సిగ్నల్స్ పాస్ చేసి ముందుకు వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ను ఫ్రీ జోన్ నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఒక్కసారిగా మెయిన్ రోడ్డు మీదకు రావడంతో అదుపుతప్పి రెండు వాహనాలు ఢీకొనే సమయంలో ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి డివైడర్ ఢీకొడంతో పెను ప్రమాదం తప్పింది… అయినప్పటికీ బస్సు లారీ ముందు భాగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. లేకపోయినప్పటికీ రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు… పోలీసులు అక్కడ చేరుకొని రూట్ క్లియర్ చేశారు… జరిగిన ఘటనపై పోలీసు లు విచారణ చేపట్టారు..
ఇది కూడా చదవండి: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం