Telugu News

టీ ఫైబర్ గుంతలతో ప్రమాదాలు ** పట్టించుకుని అధికారులు.

హాజిపూర్ విజయం న్యూస్

0

టీ ఫైబర్ గుంతలతో ప్రమాదాలు
** పట్టించుకుని అధికారులు
(హాజిపూర్ విజయం న్యూస్):-

టీ ఫైబర్ గుంతలు వాహనదారుల ప్రమాదాలకు నిలయాయలుగా మారుతున్నాయి.మండలంలోని రాపల్లి స్టేజి వద్ద రహదారి కి ఇరువైపుల టీ ఫైబర్ భారీ గుంతలు తీసి పది రోజులు గడిచిన పూడ్చక పోవడంతో వాహనదారులకు గుంతలు కనపడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.శుక్రవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో గుంతలు కనిపించక డిసిఎం వ్యాన్ ,మోటర్ సైకిల్ డీ కోనగా స్వల్ప గాయాలయ్యాయి.రహదారిని అనుకోని వుండటం వల్ల ఇప్పటికే పలువురు గుంతలలో పడి ప్రమాదాల బారిన పడ్డా కానీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
మండల కేంద్రానికి కూత వేటు దూరం లో వున్న రాపల్లి స్టేజి జాతీయ రహదారికి రోడ్డు కు ఇరువైపుల గుంతలు తవ్వి పని పూర్తయిన తర్వాత పుడ్చకపోవడంతో రాత్రి పుటలో వాహనదారులు ,పశువులు, గుంతలు కనపడక అందులో పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయని, వాహనాదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతుంన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసరంగా తవ్వకాలు చేపడుతున్న టీ ఫైబర్, మిషన్ భగీరథ కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తవ్విన గుంతలో పనులు పూర్తి అయినా తర్వాత కూడా
పూడ్చక పోవడంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

also read :-గజ్జెల రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి