మాధాపురం లో పేరుకుపోయిన సమస్యలు.
== తూతూ మంత్రంగా కొనసాగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు…..
== నిరుప యోగంగా మారిన బందేల దొడ్డి….
ముదిగొండ, జూన్,24(విజయంన్యూస్):
మండల పరిధిలోని మాదాపురం గ్రామపంచాయతీ లో డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యల గురించి ఇటీవల కొన్ని మీడియాలలో వార్తలు రావడం మనం గమనించాం. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు, పాలకవర్గం, డ్రైనేజీ పూడిక తీతను వేగవంతంగా చేపట్టారు అందుకు వారికి ధన్యవాదాలు, కానీ ఈ పనుల్లో నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నీట్ గా చేసిన పని చివరికి వెళ్లేసరికి అసంపూర్తిగా వదిలేయడం వల్ల నీరంతా ఒక్క దగ్గరకు చేరి డ్రైనేజీలో పోటేత్తడం జరిగింది. దానివల్ల మళ్లీ యధాతధంగా రెండు రోజు ల క్రితం తీసిన కాలువలనిండా మురికి నీరు చేరి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. తీసినంత వరకు బాగానే ఉంది ఆ కొంచెం కూడా తీయించాలని దానివల్ల రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని మురికి నీరు సాఫీగా వెళ్ళిపోతుందని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?
గతంలో పాలకులు కొంత ప్రజాధనాన్ని వెచ్చించి మాదాపురం గ్రామపంచాయతీలో పంట నష్టం జరిగిన తప్పిజారి పంట పొలాల్లో పశువులు పడిన బందెల దొడ్డిలో పెట్టడం అనాదిగా వస్తున్న ప్రక్రియ అంతేకాకుండా గ్రామపంచాయతీకి కొంత ఆదాయం అలాగే పశువులను వదిలిన రైతులకు కొంత పనిష్మెంట్ ఈ విధంగా చేయడం వల్ల పశువులు విచ్చలవిడిగా తిరగడం రైతులు వదిలేయడం ఆపేస్తారని పంట పొలాలు వేసిన రైతులకు కొంత భరోసా చేకూరే పని అలాంటి బందెల దొడ్డిని నిరుపయోగంగా వదిలేయడం చాలా బాధాకరం, దీన్ని ఇలా వదిలేయడం వల్ల దీంట్లో ఎలుకలు పాములు చేరి చుట్టుపక్కల ఇండ్లలోకి చొరబడే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు పాలకవర్గం చర్యలు చేపట్టి దీన్ని శుభ్రం చేసి వాడుకలోకి తేవాలని కోరుకుంటున్నారు.