Telugu News

యువత జీవిత లక్ష్యం సాధించాలి:ఎసిపి.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: సిఐ వసంత కుమార్.

0

యువత జీవిత లక్ష్యం సాధించాలి:ఎసిపి.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: సిఐ వసంత కుమార్.

మాదకద్రవ్యాలను కూకటివేళ్లతో పెగిలించాలి: ఎస్సై సురేష్

(తల్లాడ విజయం న్యూస్): –ఖమ్మం జిల్లా తల్లాడ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయి,డ్రగ్స్ నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి మండలంలోని సర్పంచులు ప్రజాప్రతినిధులతో తల్లాడ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో వైరా ఏసీపీ స్నేహ మెహ్రా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాలను అదుపు చేయవచ్చని యువత జీవిత లక్ష్యం తెంచుకొని లక్ష్యం వైపు గా ప్రయాణించాలని తెలిపారు. సీఐ వసంత కుమార్ మాట్లాడుతూ తల్లాడ మండలానికి చెందిన సర్పంచ్ గ్రామాలలో ఉన్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని కూకటివేళ్లతో పీకేవేయాలంటే సర్పంచ్ ల పాత్ర ముఖ్యమైదన్నారు యువత పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

also read :-ఐటీసీ లో ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్

తల్లాడ ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గుట్కా గంజాయి జూదం కోడిపందేలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు .నేర ప్రవృత్తిని సమాజం నుండి తగ్గించాలంటే పోలీసులతో సమన్వయంగా పనిచేయాలన్నారు. గంజాయి డ్రగ్స్ రవాణాలో ఆటో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని అధిక కిరాయిలు ఆశ చూపితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని యువత సన్మార్గంలో పయనించాలనీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా అవుతున్న సమాచారం కానీ నిల్వ ఉన్న సమాచారం కానీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ సి పి స్నేహ మెహ్రా, సిఐ వసంత్ కుమార్, ఎస్సై సురేష్, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, ఏ ఎస్ ఐ, కానిస్టేబుల్ బాలాజీ, రంజిత్,మండల నాయకులు సర్పంచులు,ప్రజా ప్రతినిధులు పత్రిక విలేకరులు పాల్గొన్నారు.