Telugu News

ప్రకృతి, వానర ప్రేమికుడు ఏసీపీ సార్..

మూడేళ్లుగా వానర సేవలో వెంకటేష్.

0

ప్రకృతి, వానర ప్రేమికుడు ఏసీపీ 

== మూడేళ్లుగా వానర సేవలో వెంకటేష్.
== రాష్ట్రంలో తొలిసారిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోతుల కోసం వానరవనం.
ఏన్కూర్, జనవరి 21 (విజయం న్యూస్)
ఆయన పేరు ఎన్ .వెంకటేష్. కల్లూరు ఏసీపీగా బాధ్యతలు స్వీకరించి సుమారు 4 సంవత్సరాలు. విధులను ఎంత బాధ్యతగా నిర్వహిస్తారో …. పర్యావరణ పరిరక్షణలోనూ, వానరాలను ప్రేమించడంలోనూ అంతే బాధ్యతగా వ్యవహరిస్తారు. ఇందుకు తార్కాణమే ఆయన  సత్తుపల్లిలో తన కార్యాలయం ప్రాంగణంలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వానరవనం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటుచేసిన వానర వనంగా దీనికి గుర్తింపు లభించింది. తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలోనూ ప్రకృతి పరిరక్షణ లో భాగంగా తన వంతు బాధ్యతగా మొక్కలను నాటుతున్నారు. ఏన్కూరు మండలం నాచారం గుట్టపై గల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, అదే
మండలంలో గార్లొడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నాటిన మొక్కలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
 
== మూడేళ్లుగా కోతుల కోసం నిత్యం ఆహారం అందజేత. 
 ఆయన ఎటు వెళ్లినా తన వాహనంలో మొక్కలు , ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంటాయి. మార్గమధ్యంలో కోతులు కనిపించగానే ఆగి వాటికి ఆహారం అందజేయడం అతనికి నిత్య కృత్యం. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఆలయాలు మూతపడటంతో భక్తులు రాక లేకపోవడంతో సమీపంలోని కోతులు ఆహారం కోసం అలమటించడం ఆయనను కలచి వేసింది.దీనిని దృష్టిలో ఉంచుకొని ఆనాటి నుండి పెనుబల్లి మండలం నీలాద్రిశ్వర ఆలయ ప్రాంగణంలో గత మూడు సంవత్సరాలుగా కోతుల కోసం నిత్యం అన్నదానం ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి అక్కడికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతోపాటు కోతులకు పండ్లు కూడా అందజేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా మండల పాడు మందాకిని నర్సరీ తదితరుచోట్ల కోతులకు ఆహారం అందజేస్తూ సత్తుపల్లి ప్రాంతంలో వానర సేవకుడిగా పిలవబడుతున్నారు.          ఇది కూడా చదవండి ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు
== ప్రకృతి తోనే మానవ మనుగడ సాధ్యం: ఎన్. వెంకటేష్, ఏసిపి , కల్లూరు
పకృతి పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం , వానర సంరక్షణ కోసం నా వంతు కృషి చేస్తున్నాను. ప్రకృతి సమతుల్యత కోసం జంతు జీవాల పట్ల సేవా భావంతో ఉండటం వలన ప్రకృతి సమతుల్యతను పాటించినట్లు అవుతుంది. మనిషి ప్రకృతిలో భాగమే కాబట్టి దానిని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది .విద్య నిర్వహణతో పాటు సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం నాకు ఆత్మ సంతృప్తి నిస్తుంది. నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకుల నుంచి ఉపశమనం లభిస్తుంది.