Telugu News

నువ్వు కొట్టినట్టు చెయ్… నేను ఏడ్చినట్టు చేస్తా : పొంగులేటి 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తాం

0
నువ్వు కొట్టినట్టు చెయ్… నేను ఏడ్చినట్టు చేస్తా : పొంగులేటి 
== బీజేపీ, బీఆర్ఎస్ తీరిది*
== కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తాం*
== పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి హామీ
(కొత్తగూడెం -విజయం న్యూస్)
 వ్వు కొట్టినట్టు చెయ్… నేను ఏడ్చినట్టు చేస్తా… అనే చందంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన చుంచుపల్లి మండలానికి చెందిన పాస్టర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ …. చెప్పిన మాట చెప్పకుండా రెండు రోజుల పాటు మాట్లాడే ఘనుడు సిఎం కేసీఆర్ అని విమర్శించారు. మభ్యపు మాటలతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చాడన్నారు.
ఇప్పుడు ఆ మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగూడెం నియోజకవర్గంలో  క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలు ఓపిక పడితే నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, నాగేంద్ర త్రివేది, తూము చౌదరి, ఆళ్ళ మురళి, మండల పాస్టర్లు జె. థామస్, పి. అబ్రహం, డేవిడ్ పాల్, రాజు శర్మ, ఇమానియాల్, యోహాన్, లీలావతి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
==  మహిళా  పోలీస్ కుటుంబానికి పరామర్శ
భద్రాచలంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తుండగా  ఆ రోజు కురిసిన వర్షానికి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన మహిళా పోలీస్ శ్రీదేవి కుటుంబాన్ని పొంగులేటి పరామర్శించారు. చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.