Telugu News

ఎస్.బి.ఐ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి

రీజనల్ మేనేజర్ కు వినతి.

0

ఎస్.బి.ఐ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి.

== రీజనల్ మేనేజర్ కు వినతి.

(ఏన్కూర్ – మే 9(విజయం న్యూస్)

ఏన్కూర్ ఎస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ శ్రీకాంత్ నాయక్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఖమ్మం ఎస్.బి.ఐ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.

ఇది కూడా చదవండి:-:ఏన్కూరులో పది పరీక్షల్లో సర్కార్ బడులదే హవ్వా 

తనకు ఏన్కూర్ ఎస్.బి.ఐ బ్యాంకులో ఖాతా ఉన్నదని, గతంలో నాకు తెలియకుండా నా ఖాతా నుంచి డబ్బులు తీసి ఇన్సూరెన్స్ కట్టారని ఈ విషయంపై గత ఏడాది ఆగస్టులో అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేశానన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజర్ తన పట్ల దురుసుగా, అమర్యాదగా వ్యవహరించారని ఆయన రీజనల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. బురద రాఘవపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే ఖాతాదారుడి ఖాతా నుంచి అతనికి చెప్పకుండా కొంత డబ్బులు మిస్ లినియస్ సర్వీస్ క్రింద కట్ చేశారని అన్నారు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా మాట్లాడారని, ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఎస్.బి.ఐ బ్యాంక్ మేనేజర్ పై తగిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సంఘం ఆధ్వర్యంలో రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా నాయకులు ధరావత్ రాందాస్ నాయక్, బానోతు ఉపేందర్ నాయక్, బోడ సాయి నాయక్, బానోత్ శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం మే: పొంగులేటి