Telugu News

ఇనాం పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు:ఎస్ఐ సురేష్

శుభకార్యాలలో ఇనాం బహుమతి పేరుతో డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తల్లాడ ఎస్ఐ సురేష్ హెచ్చరించారు.

0

ఇనాం పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు:ఎస్ఐ సురేష్

(తల్లాడ – విజయం న్యూస్)
శుభకార్యాలలో ఇనాం బహుమతి పేరుతో డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తల్లాడ ఎస్ఐ సురేష్ హెచ్చరించారు.
ఎస్ఐ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో కొంతమంది సహజంగా తమకు భగవంతుడు ఇచ్చిన తమ శారీరక అసమతౌల్యాన్ని కలిగిన వర్గానికి చెందిన వారు మరియు పశువులతో బిక్షాటన చేసుకునే వర్గాలు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ,దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు తమ దృష్టికి వస్తూ ఉన్నవి.

ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు,గృహప్రవేశాలు , పెళ్లిళ్లు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించిన కొంతమంది ఎద్దుతో మరియు ఇతర వేషధారణతో,ఆ ఇంటి వద్ద వాలి పోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తున్న పలు సంఘటనలు మా దృష్టికి వస్తున్నవి వేడుక జరుపుకునే వారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది . అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా స్మశాన వాటిక వద్దకు చేరిపోయి దుఃఖంలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా తెలుస్తోంది.ఇటువంటి వారు వారి జీవన ఉపాధి కోసం ఇతర వృత్తిలో లేక చిన్న చిన్న పనులు కూలి పనులు చేసుకుని జీవించాలి తప్ప ఇతరులపై పడి దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరుల శ్రమను గుచ్చుకోవడం అనైతికంకావున ఇప్పటి నుండి తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 (టోల్ ఫ్రీ) నెంబర్ కు లేదా పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి వివరాలు తెలియజేసినట్లయితే ఐదు నిమిషాలలో బాధితుల సమక్షంలోనికి దగ్గరలో వున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది,పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

also read :- నూతన మద్యం దుకాణాల విధి విధానాలు.