Telugu News

కార్యకర్తలే సర్కార్ కు సైనికులు.. ఖమ్మం మేయర్ నీరజ.

- ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా కృషి చేద్దాం.

0

కార్యకర్తలే సర్కార్ కు సైనికులు.. ఖమ్మం మేయర్ నీరజ.

— ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా కృషి చేద్దాం.

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):- 

టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రోద్బలంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  చొరవతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధితోపాటు, జిల్లా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలను గడపగడపకు చేరవేసే బాధ్యత ప్రతి బూత్ లెవెల్ కార్యకర్తపై ఉంది.

ఈ రోజు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశాలతో నగర టిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు  ఆధ్వర్యంలో నిర్వహించిన ఖానాపురం హవేలి టిఆర్ఎస్ కార్యకర్తల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు , మేయర్ నీరజా , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్ , బీరెడ్డి , ఖానాపురం హవేలి టిఆర్ఎస్ కన్వీనర్ కొనకంచి వరప్రసాద్, ఖానాపురం హవేలి కార్పొరేటర్లు, వివిధ వివిధ డివిజన్ అధ్యక్షులు పాల్గొని ఖానాపురం హవేలి బూత్ కమిటీ సభ్యులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సీఎం ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అందిస్తున్న సంక్షేమ పథకాలను, వివిధ అభివృద్ధి కార్యక్రఆధ్వర్యంమాలను గడపగడపకు తీసుకుని వెళ్లేందుకు కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్య నాయకులు సలహాలు, సూచనలు అందించడమేనది.

ఈ కార్యక్రమంలో ఖానాపురం హవేలి టిఆర్ఎస్ కన్వీనర్ కొనకంచి వరప్రసాద్ , ఖానాపురం హవేలి కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

also read :-అక్రమ వెంచర్లను అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.