Telugu News

కార్యకర్తలే బలం.. బలగం : ఎంపీ నామ

రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలుసు  

0
కార్యకర్తలే బలం.. బలగం : ఎంపీ నామ
== కార్యకర్తల కష్టంతోనే పదవులు  
== రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలుసు  
==  మంచి మెజార్టీతో మదన్ లాల్ ను గెలిపించుకుందాం
== మాయ మాటలు నమ్మొద్దు
==  కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం :ఎమ్మెల్యే  రాములు నాయక్
==  సేవ చేసి రుణం తీర్చుకుంటా! :  మదన్ లాల్
== కొణిజర్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, మదన్ లాల్
కొణిజర్ల, అక్టోబర్ 8(విజయం న్యూస్):  
మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటేనే కేసీఆర్ వద్ద మనందరి గౌరవం మరింతగా పెరుగుతుందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొణిజర్ల మండలం తీగల బంజారలో ఆదివారం పార్టీ మండల అధ్యక్షులు చిరంజీవి అధ్యక్షతన  జరిగిన పార్టీ మండల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కొణిజర్ల మండలం మంచి అవగాహన ఉన్న మండలమని, గతంలో తనకి ఈ మండలం నుంచి మంచి మెజార్టీ వచ్చిన విషయాన్ని నామ గుర్తు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా గట్టి నాయకత్వం ఉన్న ఈ మండలం నుంచి మదన్ లాల్ కు బ్రహాండమైన మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. కార్యకర్తల కష్టం వల్లనే నేడు మనందరికీ పదవులు దక్కాయన్న సంగతి మరువకూడదని, కార్యకర్తలే మన బలం… బలగమని నామ చెప్పారు. రైతు బిడ్డగా తనకు అన్నదాతల కష్టాలన్నీ తెలుసని, దేశంలో ఏ రాష్ట్రంలో లేవిధంగా సీఎం కేసీఆర్ రైతు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
రైతు బంధు కింద 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం చరిత్ర అన్నారు. మాయ, మోసపు మాటలు నమ్మి, నష్టపోవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యాట్రిక్ తధ్యమన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుందని, తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు పుష్కలంగా పండుతాయని నామ అన్నారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణా సీఎం కావడం మనందరి అదృష్టమని,ఆయన నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ తధ్యమన్నారు. మదన్ లాల్ ను మంచి మెజార్టీ తో  గెపించుకోవడం ద్వారా మన గౌరవం మరింత ఇనుమడిస్తుందన్నారు. అందరం సమైఖ్యoగా ముందుకు కదులుదామని పిలుపునిచ్చారు. వైరా అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ మీలో ఒక్కడిగా వుంటూ ప్రజా సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని అభ్యర్ధించారు.దీవించి, మంచి మెజార్టీతో గెలిపిస్తే సేవ చేసుకుని ,నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జెట్పీటీసీ పోట్ల కవిత, పోట్ల శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, పార్టీ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు , జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,చల్లా మోహన్ రావు,  సర్పంచ్ అఫ్జల్ బీ, మాధవరావు, బండారు కృష్ణ,  బోడపోతుల బాబు, పాముల వెంకటేశ్వర్లు, కిలారు కిరణ్, జడ మల్లేష్, పోసుల శ్రీనివాసరావు, సాయిని నర్సయ్య, చల్లగొండ  రమేష్, లాల్ సింగ్, మాలోత్ రామదాస్ , చల్లా నరసింహారావు, అనుమొలు శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సొసైటీ చైర్మన్లు, గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
==  భారీ ర్యాలీ – ఘన స్వాగతం
ఈ సందర్భంగా ఊరి బయట నుంచి తీగల బంజారలోని2 ఫంక్షన్ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీ నామ నాగేశ్వరరావు కు అపూర్వ స్వాగతం పలికారు. నామ ప్రచార రథం పై ఉండి, అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.పార్టీ కార్యకర్తలు వారిపై పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు, వీర తిలకాలతో స్వాగతం పలికారు.
==  సమీక్ష…దిశ నిర్దేశం
ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రామాలు, బూత్ ల వారీగా గ్రామ, మండల నాయకులతో సమీక్షించి, దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతి బూత్ నుంచి పార్టీ అభ్యర్థికి  మంచి మెజార్టీ వచ్చేందుకు కృషి చేయాలని ఎంపీ నామ గ్రామ నాయకులను కోరారు.