Telugu News

జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

0

జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డ భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్  సమక్షంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్నాయక్ మరియు రాష్ట్ర ఎస్.టి. సెల్ ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్ గార్ల ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరినారు.

జూలూరుపాడు మండలం, బేతాలపాడు గ్రామం నుండి టి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన 25 కుటుంబాల వారు టి.ఆర్.ఎస్. పార్టీ విధివిధానాలకు మరియు వారిచేసే నిరంకుశపాలనకు, కుటుంబపాలనకు వ్యతిరేకంగా నిరశిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పువ్వాళ దుర్గాప్రసాద్సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సేవలకు, విధివిధానాలకు గతంలో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలకు పెట్టినపేరు, కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరినవారందరినీ సాదరంగా ఆహ్వానించి అభినందించారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ* గెలుపుకోసం, అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

also read :-రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ

బేతాలపాడు గ్రామంనుండి కాంగ్రెస్ పార్టీలో చేరినవారు జి. రాంబాబునాయక్, ప్రియాంక, బి. రుక్కి, జి. బుజ్జి, వి. కంసేలి, జి. చిన్ని, బి. సుగుణ, జి. హుస్సేని, జి, సుజాత, వి. విజయ, బి. శాంతి, జి. సంధ్య, జి. పద్మ, బి. సరోజ, జి. లలిత, బి. బుల్లి, జి. సోమ్లా, డి. సురేష్, ఇ. బాల, అభిరామ్, హరిసింగ్, జి. కోటేశ్వరరావు, లక్ష్మణ్, అశోక్, ధర్మ, బిక్కు, బి. వీరు, జి. బుజ్జి తదితర కుటుంబాలవారున్నారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా,శేఖర్ గౌడ్, జిల్లా ఎస్.సి. సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, వైరా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, సంధ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు.