Telugu News

చర్చలు విఫలం..ప్రగతిభవన్ కు పాద యాత్ర కొనసాగింపు.

ఆదివాసిలలొ చైతన్యం

0

చర్చలు విఫలం..ప్రగతిభవన్ కు పాద యాత్ర కొనసాగింపు.

*ఆదివాసిలలొ చైతన్యం

*దొరా ఓ పాలి ప్రగతి భవన్ కు రా

అశ్వారావుపేట జూన్  26 (విజయం న్యూస్)

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామపంచాయితీ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27వ తేదిన ఉదయం 8.00 నుండి రామన్నగూడెం గ్రామము నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని రామన్నగూడెం గ్రామస్థులు తీర్మానం చేసిన విషయం విధితమే. శనివారం ఈ విషయం పై తహశీల్దారు వీరితో చర్చలు జరిపారు.కాని చర్చలు సఫలీకృతం కాలేదు.దీంతో వీరు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

allso read:- తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య…!
పాదయాత్రను నిర్వహించి మా రామన్నగూడెం గ్రామపంచాయితీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కి విన్నతి పత్రమును సమర్పించటం జరుగుతుందని వారు తెలిపారు. వారు డిమాండ్స్ ను తెలిపారు.
1).రామన్నగూడెం గ్రామపంచాయితీ లో పాత పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిఉండిన వారికి డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకలను వెంటనే మంజూరు చేసి ఇవ్వాలని
2). రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు: 30,36,39 లు గల ఆదివాసి రైతుల పట్టా భూములను హైకోర్టు ఆరడర్స్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోర్టు ఆదేశాలు ప్రకారం పట్టాలు కలిగిన ఆదివాసీ రైతులకు వెంటనే అప్పగించాలని.

allso read:- తాటి ఆరోపణ వాస్తవమేనా?

3.రామన్నగూడెం గ్రామపంచాయితీ పరిధిలో కొంతమంది ఆదివాసీ ప్రజల చేతిలో ఉన్న ప్రభుత్వ భూమికి అర్హత కలిగిన పేద వారికి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకలను మంజూరు చేసి ఇవ్వాలని.
4.రామన్నగూడెం గ్రామపంచాయితీ పరిధిలో వెంకమ్మ చెరువు వరద కాలువ ద్వారా భూములను కోల్పోయిన ఆదివాసి రైతులకు ఒక ఎకరాన్నికి రూ.8,00,000/- లను కాలువ నష్టపరిహారమును మరియు వెంకమ్మ చెరువు వరద కాలువ తొవ్వి 13 సంవత్సరాలు అయినందున ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వనందున మట్టి పోసిన భూమికి కూడా సంవత్సరాన్నికి ఒక ఎకరాన్నికి రూ.40,000/-

చొప్పున కౌలు కట్టి 13 సంవత్సరాలకు రూ. 5,20,000/- లను మంజూరు చేసి ఇవ్వాలని,5.రామన్న గూడెం గ్రామపంచాయితీ లో ఉన్న అన్ని మట్టి రోడ్డుకు సిమెంట్ రోడ్లగా మార్చటాన్నికి ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలి.రామన్నగూడెం గ్రామపంచాయితీ లో ఉన్న అంగడి స్కూల్ మరమ్మతులకు మరియు ప్రహరి గోడ నిర్మాణమునకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని.
7.రామన్నగూడెం గ్రామపంచాయితీ రేషన్ కార్డ్స్ లేని వారికి వెంటనే రేషన్ కార్డను మంజూరు చేయాలని కోరారు
8.రామన్నగూడెం గ్రామపంచాయితీ ఉన్న వింతతు పెన్షన్ రానివారికి వెంటనే వితంతు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని. 9.రామన్న గూడెం గ్రామపంచాయితీ లో ఉన్న అర్హత కలిగిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లులను మంజూరు చేయాలని. 10. తెలంగాణ రాష్ట్రము లో ఉన్న గిరిజనులకు గిరిజన బంధును మరియు వెనుకబడిన వర్గాల వారికి BC బంధును ప్రభుత్వం. వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు.ఈ సమస్యలను స్దానిక అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి, తీసుకెళ్లి అలసి పోయామని,అందుకే గ్రామస్థులు అందరం కలిసి ప్రగతిభవన్ లొ ముఖ్యమంత్రి నే కలిసి విన్నవించుకొందామని నిర్ణయించినట్లు తెలిపారు.
దొరా చైతన్యం మొదలైంది ఓపాలి చూడు.ఫార్మ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు రా….అంటున్నారు ఆదివాసిలు