Telugu News

హాజీపూర్ లో ఇంటర్ విద్యార్థి బావిలో దూకి బలవన్మరణం

హాజీపూర్ లో విషాదం.  మిన్నంటిన కుటుంబ సభ్యుల రోధనలు

0
ఇంటర్ విద్యార్థి బావిలో దూకి బలవన్మరణం
** హాజీపూర్ లో విషాదం.  మిన్నంటిన కుటుంబ సభ్యుల రోధనలు
(హాజిపూర్ -విజయం న్యూస్)
ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్న బెంబడి ఆదిత్య అనే విద్యార్థి సోమవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాజీపూర్ పోలీస్ ల కథనం ప్రకారం ఆత్మహత్య ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన బెంబడి ఆదిత్య మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.  మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి గా గుర్తింపు పొందాడు. కుటుంబ సభ్యులు అందరూ కాశీ యాత్రకు  వెళ్దామని సిద్ధం అయ్యారు. కుమారున్ని ఇంట్లో ఉంచి మరో గంటలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటడగా ఆదిత్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
తాను ఆత్మహత్య చేసుకొనున్నట్లు  ఆదిత్య తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ స్నేహితుడు ఆదిత్య ఇంటి వద్దకు వచ్చి  తల్లిదండ్రులకు ఆత్మహత్య గురుంచి ఫొన్ చేసిన విషయం చెప్పాడు.  కలవర పడిన తల్లిదండ్రులు వెతకగా ఇంటి వెనకాల బావి దగ్గర ఉన్న ఒక ముసలావిడ ఆదిత్య బావిలో దూకాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు , బంధువుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న  హాజీపూర్ పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి శవపంచనామ నిమిత్తం తరలించారు. ఆదిత్య మనసులో ఏదో పెట్టుకుని ఎవరికీ చెప్పుకోలేక జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హజీపూర్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.