Telugu News

ప్రభుత్వ వైద్యం పేదలకు అందేనా.. వైద్యమందక అవ్వకు ఇబ్బంది

ఇచ్చోడ విజయం న్యూస్

0

ప్రభుత్వ వైద్యం పేదలకు అందేనా

(ఇచ్చోడ విజయం న్యూస్) :-

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్లో నివాసముంటున్న పేద వితంతువు ఆలకుంట పీరక్క, ప్రభుత్వ వైద్యం కోసం ఎదురుచూస్తుంది. గత రెండు సంవత్సరాలుగా చేతికి ఇన్ఫెక్షన్ సోకి కుడి చేతికి మోచేతి నుండి దండ వరకు పుండుగా మారి చీము రక్తం వస్తుందని మా తాహతుకు సరిపడా చిన్న చితక వైద్యం చేయిస్తున్న నయం కావడం లేదని భర్తలేని తనకు కొడుకు కూలిపని చేస్తూ కుటుంబానికి ఒక్కడే ఆధారమని ఉన్నత వైద్యం చేసుకునే స్తోమత లేదని పీరక్క ఆవేదన గా పలువురి ముందు కంటతడి పెట్టుకుంటుంది.

సుభాష్ నగర్ లో ప్రభుత్వ ఆరోగ్య సబ్ సెంటర్ కు దగ్గర లోనే పీరక్క ఇల్లు ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క ఆరోగ్య సిబ్బంది కనీసం ఈమె గురించి ఉన్నతాధికారులకు తెలపక పోవడం ఈమెను రిమ్స్కు తరలించక పోవడం ఒక్క సుభాష్ నగర్ సబ్ సెంటర్ లోనే ఇద్దరు ఏ.యన్.యం.లు, నలుగురు ఆశా కార్యకర్తలు ఉన్నా పీరక్కకు ఉన్న వ్యాధి గురించి ఎలాంటి సమాచారం వీరు సేకరించక పోవడం గమనార్హం ఇకనైనా సంబంధిత అధికారులు ఈ పేద వితంతు మహిళలను ఉన్నత వైద్యం కోసం రిమ్స్ కు తరలించి పేదవారికి ప్రభుత్వ వైద్యం అందుతుంది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

also read :- ఘనంగా కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయ పునఃప్రారంభోత్సవం.