ఖమ్మంలో కల్తీ పాలు బాగోతం
== 8వ డివిజన్ లోని ఓ ఇంట్లో కల్తీపాలు తయారి
== తయారి కేంద్రాలపై అధికారుల దాడులు
== పరారిలో తయారిదారులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలో కల్తీపాలు తయారి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.. ఇప్పటికే అనేక దఫాలుగా మీడియా వార్తలను ప్రచురితం చేస్తున్నప్పటికి పట్టించుకుని అధికారులు.. కల్తీపాల వాహనం ప్రమాదానికి గురి కావడంతో మూడవ కన్ను తెరిచి కల్తీ కేంద్రాలపై దాడులకు దిగారు.. ఇన్నాళ్లు దర్జాగా కల్తీపాలను తయారు చేసిన వ్యాపారులు ఆ సంఘటనతో పరారైయ్యారు.. అధికారులు వస్తున్నారనే సమాచారంతో అక్కడ నుంచి పరారు కావాడం పలు అనుమానాలకు తావీస్తోంది.. పూర్తి వివరాల్లలోకి వెళ్తే ఖమ్మంలో కల్తీపాలు తయారి బాగోతం బట్టబయలైంది.. ప్రజలకు హానికరమైన పాలను తయారు చేస్తున్న కొందరి గుర్తు తెలియని వ్యక్తులు ఖమ్మం నగర శివారు గోపాలపురం 8వ డివిజన్ లో ఓ ఇంటిని కేంద్రంగా చేసుకుని కల్తీ పాలను తయారు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:- కాంగ్రెస్,కామ్రెడ్ల పొత్తు సంగతేంటి..?
బ్రాండెడ్ కంపెనీల పేరుతో కవర్లను తయారు చేసి కల్తీ పాలను తయారు చేసి మార్కెట్ లోకి పంపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు శనివారం అకస్మికంగా దాడులు చేశారు. పాల తయారి కేంద్రాన్ని గుర్తించిన అధికారులు, తయారి దారులను పట్టుకోలేకపోయారు. అప్పటికే పరారైనట్లు జిల్లా అధికారి మీడియాకు తెలిపారు. తయారి చేస్తున్న ఇంటిని సీజ్ చేస్తున్నామని తెలిపారు. తయారి దారులను గుర్తించి కచ్చితంగా పట్టుకుంటామని, చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.. అయితే కచ్చితంగా అధికారులు వస్తున్నారనే సమాచారం ఎవరిచ్చారనే విషయంపై సర్వత్ర విమ్మర్శలు వినిపిస్తున్నాయి..
== అసలు మోసం ఎలా బయటపడిందంటే..?
ఖమ్మం నగరంలోని గోపాలపురం వద్ద హనుమాన్ పాల డైరీ లో బాయిలర్ బ్లాస్ట్ అయ్యింది. అర కిలోమీటర్ వరకు బాయిలర్ ఎగిసిపడ్డాయి.. ఒక మహిళలకు తీవ్రగాయాలు కాగా వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి:- పేదల కోసమే 58,59 జీవో: మంత్రి పువ్వాడ
చాలా దూరం పాటు బాయిలర్ లు ఎగిసి పడ్డాయి.. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.. అయితే పాల తయారి కేంద్రంలో ఎలాంటి సెప్టీ మెరజ్మెంట్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. ఆ పాల తయారి కేంద్రానికి అనుమతులు లేవని తెలుస్తోంది.. అధికారులు మాత్రం విచారణ చేస్తున్నారు. అయితే అదే ఏరియాలో 8వడివిజన్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ పాల తయారీ చేస్తున్న నిర్వాహకులు, భారీగా కల్తీ పాలను తయారు చేస్తున్నారు. పాలకేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు, పాలపొడి మిశ్రమం ఉంది.
ఇది కూడా చదవండి:- ‘పాలేరు’ నుంచి తుమ్మల పోటీ చేయాలి
తయారు చేసిన పాలను డెయిరీ కేంద్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ కల్తీ పాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, కల్తీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.