Telugu News

కొందరి శిఖండి రాజకీయాలకు భయపడం: మంత్రి పువ్వాడ

రాజకీయాలు, వ్యక్తులు అవసరం లేదు.. అభివృద్ది అవసరం

0

కొందరి శిఖండి రాజకీయాలకు భయపడం: మంత్రి పువ్వాడ

== రాజకీయాలు, వ్యక్తులు అవసరం లేదు.. అభివృద్ది అవసరం

== ఖమ్మం అభివృద్ది పై నాకో ప్రణాళిక ఉంది

== ఖమ్మం ప్రజలు విజ్జులు..ఆలోచించి ఓటేస్తారనే నమ్మకం నాకుఉంది

== 12వ డివిజన్ లో ఆత్మీయ సమ్మెళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో కానీ, ఖమ్మం జిల్లా అభివృద్దిపై కొందరు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారు సమాజానికి చాలా ప్రమాదమని, వారిని ఎట్టిపరిస్థితుల్లో దరి చేరనీయవద్దని, తద్వార ప్రమాదం పొంచి ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరం 12వ డివిజన్ నేతాజీ నగర్ నందు చెరుకుమళ్ళ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.. ప్లీజ్ ఒక్క సారి ఛాన్స్ ఇవ్వండి అన్నందుకే కర్ణాటక రాష్ట్ర వెనక్కి పోయిందని, కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుని, నగరాన్ని మళ్ళీ వెనక్కి నెట్టలని స్వార్థ ప్రయోజనాల కోసం తిరుగుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనకి రాజకీయాలు, వ్యక్తులు అవసరం లేదు.. అభివృద్ది అవసరమని స్పష్టం చేశారు. ఖమ్మం నగరం అందరికీ చెందింది. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ది చేశానని అన్నారు.

ఇది కూడా చదవండి: త్వరలో లకారం వద్ద మరో అద్భుతం ఆవిష్కృతం: మంత్రి

సాధారణంగా ప్రతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువ ఉంటాయి.. కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి.. కానీ ఖమ్మం నగరంలో అన్ని ప్రాంతాలు ఒకే మాదిరిగా ధరలు పెరిగాయని తెలిపారు. ఇప్పుడు నగరంలో గజం రూ.15వేలకు తక్కువ ఎక్కడా లేదు. విభజన లేకుండా ఖమ్మం నగరం నాలుగు దిక్కులా మనం చేసిన అభివృద్దే కారణమన్నారు. త్రీ టౌన్ లో ఒకప్పుడు స్థలం కొనాలన్నా.. ఇల్లు కట్టలన్నా ఆలోచించే పరిస్థితులు.. కానీ నేడు గాందీ చౌక్ లాంటి ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అపార్ట్మెంట్ లు, విల్లాలు కట్టుకుంటున్నారు.. కారణం ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు, రవాణా సౌకర్యం మెరుగుపరచడమే కారణమని స్పష్టం చేశారు. రూ.690 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా త్వరలో నిర్మించనున్న ఆర్సీసీ రక్షణ గోడలు నిర్మించి మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా శాస్వత పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. రూ.180 కోట్లతో హైద్రాబాద్ దుర్గంచెరువు మాదిరి నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి తో త్రీ టౌన్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మున్నేరులో ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం బోటింగ్, వాకింగ్ ట్రాక్, మినీ ఇలా పలు కార్యక్రమాలు చేసుకుందామని తద్వారా నగర ప్రజలంతా ఇక్కడికే వచ్చి సేదతీరే విధంగా ఎర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.30 కోట్లతో మున్నేరు పై మూడు చెక్ డ్యాం లు నిర్మించనున్నాం. తద్వారా ఖమ్మం నగరం మొత్తం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఏడాది మొత్తం మున్నేరులో నీటి నిల్వ ఉండడం తో పాటు, మన అవసరాల కోసం బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మం నగర నడిబొడ్డున ఎన్ఎస్పీ  క్యాంప్ లో రూ.40 కోట్లతో ఆర్టీసి ఏసి కన్వెన్షన్ హాల్ నిర్మించడంతో ఆ ప్రాంతం మొత్తం వ్యాపార పరంగా రానున్న రోజుల్లో మరింత అభివృధ్ది చెందుతుందని హామినిచ్చారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పై కరుణ చూపాలి: మంత్రి పువ్వాడ

ఖమ్మంలో గతంలో ఆహ్లాదం కోసం ఒకప్పుడు సినిమా తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండేదా..? కానీ నేడు లకారం ట్యాంక్ బండ్ లో తీగల వంతెన, బోటింగ్, అడ్వెంచర్ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లు, జిమ్ లు, గొళ్ళపాడు ఛానల్ పై 10 పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు,  ఇలా అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. ఖమ్మం అభివృద్ది పై నాకో ప్రణాళిక ఉంది.. హైద్రాబాద్ లో ఉండే సదుపాయాలు తీసుకురావాలనే తపన ఉంది. కాబట్టే ఇన్ని కోట్ల నిధులు తీసుకువచ్చానని, ఆ ఘనత నాకే దక్కుతుందన్నారు. ఒకప్పుడు ఖమ్మంకు ఒక ప్రణాళిక ఉందా.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అనేక వ్యవస్థలు తీసుకురాగలిగినం. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకువచ్చి ప్రారంభించామన్నారు. మద్దులపల్లి వద్ద జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తున్నాం. నర్సింగ్ కళాశాల నిర్మించేందుకు మొన్ననే హరీష్ రావు  చేత శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. విజ్ఞులైన మీరంతా ఆలోచనతో కనిపిస్తున్న అభివృద్దికే ఓటు వేయాల్సి అవసరం ఉంది. బీఆర్ఎస్  ప్రభుత్వంను బలపరచి తోడుగా నిలవాలని కోరుకుంటున్నానని కోరారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ నాగేశ్వర రావు, వల్లభనేని రామారావు, చేరుకుమల్ల శ్రీనివాస్, దుద్దుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, వీరయ్య బాబు, మోత్కూరి సత్యనారాయణ, గుర్రం భద్రం, దిరిశాల వెంకటేశ్వర్లు, వనమా లక్ష్మణ రావు, రజనీ, భారతి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..