Telugu News

ప్రకృతి కన్నెర్ర… నిండా మునిగిన రైతన్నలు

*అకాల వర్షం తో అపార నష్టం

0

ప్రకృతి కన్నెర్ర… నిండా మునిగిన రైతన్నలు

*అకాల వర్షం తో అపార నష్టం

(శ్రీనివాస్ రెడ్డి బద్దం, మల్లాపూర్-విజయం న్యూస్);-

అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఈదురుగాలులు, వడగండ్ల తో రైతుకు కన్నీళ్లే మిగిలాయి.కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు కొట్టుకుపోయాయి…చేతికి వచ్చిన నువ్వులు నేల పాలయ్యాయి.మామిడి కాయలు నేల రాలాయి. ఇలా ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు,వర్షంతో విద్యుత్ వైర్లు పొలాల్లో పడ్డాయి..చేతికి వచ్చిన పంటలు నెలపాలు అవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరు గారుస్తున్నారు.తమను ఆదుకోండి అని వేడుకుంటున్నారు.ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఎంత పంట నష్టం వాటిల్లిందని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతకుముందు ఎన్నో నష్టపరిహారం అంచనాలు వేసి చేతులు దులుపుకున్నారని,ఇప్పుడు అలా కాకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని,అధికారులను వేడుకుంటున్నారు.

also read :-ఖమ్మంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
== రైతులను ఆదుకోవాలి:- బీఎస్పీ
బహుజన సమాజ్ పార్టీ మల్లాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కొత్తదామెరాజుపల్లి గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షుడు బోడ ప్రశాంత్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి వరి గింజలు మేము కొంటామని అని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు సరైన పద్ధతిలో నడపక పోవడం వల్ల కొనుగోలు ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. సరైన సమయంలో పంట కొనుగోలు జరగకపోవడంతో నిన్న కురిసిన అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోవడమే కాకుండా కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం కారణంగా వరి కేంద్రంలో తడిసి పోయిన ధాన్యాన్ని చూడడానికి గాని రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కానీ ఏ ఒక్క అధికారి రాకపోవడం నిజంగా ఇది రైతు వ్యతిరేక చర్య అని విమ్మర్శించారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనాలని అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

also read :-హమాలీల పై తప్పుడు ప్రచారాన్ని ఖండించండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు .
== రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్ కు విన్నపం
అకాల వర్షం తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ మండల శాఖ ఆధ్వర్యంలో, అలాగే బిజెపి కిషన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వేరు వేరుగా వినతిపత్రం అందజేశారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు వరి, మామిడి, నువ్వులు, సజ్జలు, పంట నష్టం చాలా జరిగిందని, రైతులు చాలా నష్టపోయారు కావున రైతుల పట్ల ప్రభుత్వం చర్య తీసుకుని పంట నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు. అలాగే వరి కొనుగొలు విషయంలో రైస్ మిల్లర్లతో మాట్లాడి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చూడాలని కోరడం జరిగింది రైతులకు 15 వెయిల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు,బీజేపీ కిసాన్ మోర్చ సభ్యులు ,రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మల్లం మండల ఉపాధ్యక్షులు సెక్టార్ కమిటీ అధ్యక్షులు అనుపట్ల దినేష్ మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎర్ర శరత్,చేటుపల్లి శ్రీను,దప్పుల వెంకటేష్,తిమ్మని శేఖర్, పాతకాల రాహుల్, మొగిలి చింటూ తదితరులు పాల్గొన్నారు.