Telugu News

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : వ్యవసాయ కార్మిక సంఘం

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

0

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి .

( ఖమ్మం విజయం న్యూస్):-

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగింది ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు కనీస కూలీ చట్టం లేక అనేక గ్రామాల్లో కూలీలకు అన్యాయం జరుగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలకు సమగ్ర చట్టం చేసి ప్రభుత్వం ద్వారా అమలు చేయాలన్నారు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రోజు కూలీ కేవలం 250 రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోజుకు కనీసం 350 రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు ఇటీవల కాలంలో మిర్చి కి క్రిమికీటకాలు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆ రైతుల దగ్గర మిర్చికోసే కూలీలకు పని లేకుండా పోయింది ప్రభుత్వం రైతులను ఆదుకోవడం తో పాటు కూలీలను కూడా ఆదుకోవాలని కూలి బంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు

కూలి బీమా కూడా అమలు చేయాలన్నారు ఉపాధి పనులను సంవత్సరంలో 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయలు కేరళ తరహాలో రోజు కూలీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు శారీరక శ్రమను నమ్ముకున్న వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వ సహకారం లేదన్నారు ఇటీవల చౌకదుకాణాల్లో ఇచ్చే బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు కేజీలు మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టిధీ అన్నారు కరోనాతో ఆరోగ్యాలు బాగా లేక పెరిగిన ధరలతో ఆహార పదార్థాలు కూరగాయలు కనుక్కోలేక కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన పాలకులు ఆహార పదార్థాలు అందించకపోవడం ప్రత్యేకించి బియ్యం కోత విధించడం దారుణమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని పేదలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలందరికీ ఇస్తామని స్థలం ఉన్నచోటే ఇల్లు కట్టుకునే వారికీ 5: లక్షల 50000 రూపాయలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేటికీ అమలు చేయకపోవడం దారుణం అన్నారు వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు 57 సంవత్సరాలు నిండిన ఆసరా పెన్షన్ అర్హులందరికీ దరఖాస్తులు తీసుకొని నేటికీ పెన్షన్లు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందన్నారు తక్షణం పెన్షన్ లను విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు పోడు సాగు దారులకు పట్టాలు ఇస్తామని చెబుతూనే సాగు దారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

ఇది దారుణం అన్నారు వెంటనే అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలన్నారు రానున్న రోజుల్లో వ్యవసాయ కార్మికులు ఆకలి చావులు లేకుండా అందరికీ పనులు కల్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పొన్నెకంటి సంగయ్య, వత్సవాయి జానికిరాములు, కొండ బోయిన నాగేశ్వరరావు, జాజిరి శ్రీనివాస్ వడ్లమూడి నాగేశ్వరరావు, అంగిరేకుల నరసయ్య, గద్దల రతమ్మ ప్రతాపనేనీ వెంకటేశ్వర్లు, భారీ మల్సూర్, వేల్పుల భద్రయ్య, దుగి వెంకటేశ్వర్లు, బంధం శ్రీను, గాయం తిరుపతిరావు, జి గుమ్మ నరసింహారావు, శంకరయ్య టీ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

also read :-ములుగు జిల్లాలో కిడ్నాఫ్ కలకలం.. ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..?