Telugu News

కాంగ్రెస్ లో చేరే లిస్ట్ ను ప్రకటించిన ఏఐసీసీ

35 మందితో కూడిన నాయకులు లిస్ట్ ను ప్రకటించిన ఏఐసీసీ

0

కాంగ్రెస్ లో చేరే లిస్ట్ ను ప్రకటించిన ఏఐసీసీ

==35 మందితో కూడిన నాయకులు లిస్ట్ ను ప్రకటించిన ఏఐసీసీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు వారి టీమ్ సభ్యులు ఈనెల 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటి అయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 35 మంది అగ్రనేతలు పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ఏఐసీసీ ఒక లిస్ట్ ను ప్రకటించింది. అందులో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, భద్రాద్రికొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కూసుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, తాడిపర్రి చరణ్ రెడ్డి, తుడి మేఘరెడ్డి, కురఅన్నకిష్టప్ప, ముడ్డప్ప దేస్ ముఖ్, జూపల్లి అరుణ, సూర్యప్రతాఫ్ గౌడ్, కొత్త కల్యాణ్ కుమార్, దండు నర్సింహ, ఎస్. కిచ్చరెడ్డి, గోపశెట్టి శ్రీధర్, సూర్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా  నుంచి డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వావిజయ్ బాబు, మహిళా కార్పోరేషన్ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, భద్రాచలం బీఆర్ఎస్ ఇంచార్జ్  తెల్లం వెంకట్రావ్, ఉద్యమకారుడు, ఎస్సీకార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, అశ్వరరావుపేట బీఆర్ఎస్ ఇంచార్జ్ జారే అధినారాయణ, బానోతు విజయబాయి, కార్పోరేషన్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బీరోలు సోసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, మధిర నాయకులు కోట రాంబాబు, ఉక్కంటి గోపాల్ రావు, డాక్టర్ రాజా రమేష్, జూపల్లి రమేష్, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, హనుమందల ఝాశ్ని రెడ్డి, రఘనాథయాదవ్, రాఘవేంద్రరెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ రాహుల్ గాంధీని కలిసివారిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దే దించుడే ఏకైక లక్ష్యం: పొంగులేటి