కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో లేను: దిగ్విజయ్ సింగ్
== పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన దిగ్గి
== అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉండే అవకాశం
(ఎడిటర్-పెండ్ర అంజయ్య)
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో నేను లేనని, అంతా సోనియా, రాహుల్ గాంధీ ఇష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవలే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, కొందరు పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్ష బరిలో నిలిచేందుకు మక్కువ చూపుతున్నారు.
allso read- ఏఐసీసీ అధ్యక్షడు ఎవరు..?
ఇప్పటికే రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, శశిథరూర్ బరిలో నిలుస్తున్నట్లు వారు స్వయంగా ప్రకటించారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని, ఆయన లేని యేడల మేము అధ్యక్ష రేసులో ఉంటామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే అధ్యక్ష బరిలో దిగ్గి బాయ్ ఉన్నట్లుగా ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల బరిలో నేను లేనని, పోటీ చేయడం ఇష్టం లేదని, పార్టీ నిర్ణయాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. దీంతో ముగ్గురు అనుకున్నది కాస్త ఇద్దరికి మారే అవకాశం ఉంది. అయితే శశిథరూర్ పై ఆయన స్వంత రాష్ట్రం కేరళ నుంచి వ్యతిరేకత మొదలైంది.. ఆయన కేరళ పార్టీకి చాలా నష్టం చేశాడని, ఆయనకు ఏఐసీసీగా పోటీ చేసే హక్కు లేదంటూ కేరళకు చెందిన కొందరు నాయకులు పదేపదే విమ్మర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో శశిథరూర్ కొంత వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ఇక ఏకైక పోటీ దారుడిగా ఆశోక్ గేహ్లాట్ కు మంచి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి విథేయుడిగా ఉన్న ఆయన చాలా సౌమ్యుడు, వివాద రహితుడిగా మంచి గుర్తింపు ఉంది.. ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా పనిచేస్తున్నఆయన వ్యతిరేకులను కూడా కలుపుకుని పోయే విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..
allso read- అధ్వానంగా పల్లె రహ ‘దారిద్ర్యం’
పంజాబ్ లో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికి కాంగ్రెస్ లో వర్గపోరు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ చేజేతులారా ప్రభుత్వాన్ని కోల్పోయింది.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేజేతులారా కోల్పోయి.. బీజేపీ ఆ విధంగా నడిపించింది. కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజస్తాన్ ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఆశోక్ గేహ్లాట్ పై జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.. చూడాలి మరి ఎన్నికలు జరుగుతాయా..? ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా..?