Telugu News

అలయ్…బలయ్..సంబురంగా రంజాన్ వేడుకలు

== ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లీం,మైనార్టీలు

0

అలయ్…బలయ్..

 

== సంబురంగా రంజాన్ వేడుకలు

 

== ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లీం,మైనార్టీలు

 

== ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యేలు, నేతలు

 

== ఈద్గాల వద్ద పలుసేవా కార్యక్రమాలు

(ఖమ్మం ప్రతినిది-విజయంన్యూస్)

ముస్లీం,మైనార్టీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో దేశవ్యాప్తంగా మంగళవారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకంటే ముందుగా నెల రోజుల పాటు భక్తశ్రద్దలతో కఠోర ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లీం,మైనార్టీలు మంగళవారంతో తమ ఉపవాసా దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఉదయం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచం శాంతిగా ఉండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో వర్థిల్లాలని, నమ్మిన సిద్దాంతాన్ని, నమ్మిన దేవుడ్ని పూజించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, కుటుంబాన్ని ప్రేమించాలని ముస్లీం పెద్దలు ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం అలయ్ బలయ్ తీసుకుని పరస్పర శుభాకంక్షలు తెలుపుకున్నారు. అలాగే ఈద్గాల వద్దకు వచ్చిన ఇతర మతస్తులతో ముస్లీం, మైనార్టీలు అలయ్ బలయ్ తీసుకుని పరస్పర శుభాకాంక్షలు చెప్పారు.

also read :-వడ దెబ్బతో మరణించిన కుటుంబానికి బియ్యం అందజేసిన భూక్యా దేవ సింగ్…..

== పలు సేవకార్యక్రమాలు
ఎండాకాలం కావడం, ఎండలు దంచికొడుతుండటంతో ముస్లీం,మైనార్టీలు, ఇతర మతస్తులు ఈద్గాల వద్ద ప్రత్యేక సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముస్లీం,మైనార్టీలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వస్తున్న సందర్భంగా వారందరికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు, సేమియాలను అందించారు. కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఆధర్యంలో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను పంపిణి చేశారు. ఖమ్మంలో ముస్లీం మతపెద్దలు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణి చేశారు.
== ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లీం,మైనార్టీలు ప్రార్థనలు చేస్తుండగా, ఈ ప్రార్థన కార్యక్రమాలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరైయ్యరు. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద జరిగే ఈద్గా వద్ద మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే పినపాకలో ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వరరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలంలో పోడెం వీరయ్య, మధిరలో జడ్పీచైర్మన్ గడిపల్లి కవిత, ఖమ్మంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ ఈద్గాలో జరుగుతున్న ప్రార్థన కార్యక్రమంలో హాజరైయ్యారు. ముస్లీం,మైనార్టీ సోదరులతో అలయ్ బలయ్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లీం సోదరులు, నాయకుల నివాసాలకు వెళ్లి సెమియాలు తాగి కుటుంబ సభ్యులందరికి అభినందనలు తెలిపారు.