Telugu News

తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ

బేరసారాల సమితి బీఆర్ఎస్: చెరుకు సుధాకర్

0

తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ

== అవినీతి అక్రమాలకు నిలయం తెలంగాణ సర్కార్

== కాళ్లేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 12వేల కోట్ల చేతులు మారాయి

== సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడిన రిటైర్డ్ ఐఏఎస్ మురళీ

== బేరసారాల సమితి బీఆర్ఎస్

== ఉద్యమకారులు లేకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడుండేదో..?

== కసితో కోట్లాడినం.. అదే కసితో మనకోసం కొట్లాడాలే

== ఉద్యమకారుడు చెరుకు సుధాకర్

== కూసుమంచిలో సక్సెస్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ

(కూసుమంచి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో ‘అలీబాబా నూరు దొంగలు’ రాజ్యమేలుతున్నారని, అందినకాడికల్లా నొక్కి, బొక్కేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. అవినీతి అక్రమాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందన్నారు. అలా సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మార్చేశారని పేర్కొన్నారు. మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్ఆర్ పంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ ఉద్యమాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఐక్యవేదిక సర్వసభ్య సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు టీడీపీ విజయశంఖారావం

ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం లక్షలాధి మంది ఉద్యమకారులు, యువకులు, చిన్నాపెద్ద తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి పోరాటం చేశామని, లాఠీ, తూటాలకు బయపడకుండా వెన్ను చూపించి మరీ పోరుబాట పట్టామని అన్నారు. 1969 లో తెలంగాణ రాష్ట్ర  పోరాటానికి ఖమ్మం జిల్లా నాంధి పలికిందన్నారు. అప్పుడు ప్రారంభమైన పోరాటం 2014 వరకు కొనసాగిందని, సోనియా గాంధీ వల్ల బంగారు తెలంగాణ, బ్రహ్మండమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. అలాంటి బంగారు తెలంగాణకు  ఫీఠమెక్కిన సీఎం కేసీఆర్      అప్పుల పాలు చేసిండన్నారు. ముఖ్యంగా కాళ్లేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలంటే మూడు రోజుల పాటు విరామం లేకుండా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి వివరించవచ్చని అన్నారు. మొదటిగా రూ.36వేల కోట్ల అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్టు నరిమాణం పూర్తైయ్యానాటికి రూ.1.20లక్షల కోట్ల బడ్జెట్ కు దాటిపోయిందన్నారు. ఇంత ఎందుకు పెరిగిందంటే సుమారు 10శాతం కమీషన్ వేసుకున్న రూ.12వేల కోట్లు కమిషన్ వచ్చినట్లేగా అని లాజికల్ గా ప్రజలకు వివరించారు. కాళ్లేశ్వరం పేరుతో భారీగా సొమ్ము కాజేసిన సీఎం కేసీఆర్, అంతే కాకుండా ఇసుక మాఫీయా, మందు మాఫీయా, గ్రానైట్ మాఫీయా, ప్రైవెట్ వైద్యం మాఫియా రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. సామాజిక తెలంగాణ రాష్ట్రం కావాలంటే మరోసారి పోరుబాట తప్పదన్నారు.

== బేరసారాల సమితి బీఆర్ఎస్ : చెరుకు సుధాకర్

సీఎం కేసీఆర్ అనేక పథకాల పేరుతో భారీగా సంపాధించుకున్న సీఎం కేసీఆర్, ఇప్పుడు జాతీయ స్థాయిలో దోపిడి చేసేందుకు బయలుదేరాడని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పోరాటం పేరుతో చాలా చోట్ల దోపిడిలకు పాల్పడిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో తెంగాణ రాబాందుల సమితి అని పిలవడంలో తప్పేమి లేదన్నారు.  ఇప్పుడు ఢిల్లీలో బేరసారాలు అడేందుకు బేరసారాల సమితి(బీఆర్ఎస్) ఏర్పాటు చేశారని విమ్మర్శించారు. సీఎం కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ర్టంలో చాలా మంది మంత్రులు దోపడిలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినంత మాత్రానా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాదని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: “పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”

== సీఎం కేసీఆర్ ఒక పుడేల్ మహరాజు:విఠల్

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు ఒక తరహాలో రాజకీయం చేశారని, తెలంగాణ వచ్చినతరువాత పుడేల్ అవతారం ఎత్తాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి వల్ల తెలంగాణ రాష్ట్రానికే ప్రమాదమని, ఇక దేశరాజకీయాల్లోకి వెళ్తే దేశానికి మరింత ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అలాంటి వ్యక్తులను ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంతమంచిదన్నారు. సామాజకి తెలంగాణ కోసం మనమంతా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

== తెలంగాణ ఉద్యామానికి గుమ్మం ‘ఖమ్మం’: బత్తుల సోమయ్య

తెలంగాణ తొలి,మలిదశ ఉద్యామాల్లో విరామం లేకుండా పోరాటం చేశనని,ప్రజల సహాకారంతో మీడియా మిత్రుల సహాకరంతో పోరాటాలు చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. సీఎం కేసీఆర్ ను అమరణ నిరహారదీక్ష సమయంలో అరెస్టు చేసిన పోలీసులు ఖమ్మం జిల్లాకు వస్తే ప్రజలందరు, ఉద్యమాకారులందరు అద్భుతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగాలు బాగుపడతాయని అనుకున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నిలువును ప్రైవేట్ వ్యక్తులకు, కార్పోరేట్ శక్తులకు అమ్మెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు. అనంతరం కరపత్రాలను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమనాయకులు ప్రథ్వీ రాజ్, తుల్జారెడ్డి, అనంతరుల మధు, షక్ నబీ, బస్సా వేణు, రమాశంకర్, పొనుగొంటి సంపత్ గారు తదతిరులు హాజరయైయ్యారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు