ఉద్యమకారులందరు బయటకు రావాలి : ఈటేల
కేసీఆర్ వాడుకోని వదిలేస్తాడు..
దొంగలకు పట్టం కడతాడు..
బీజేపీ హక్కున చేర్చుకుంటుంది.. అందుకే కేసీఆర్ ను వదలిరాండీ
ఈటేల రాజేందర్ పిలుపు
మహుబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.
(మహుబూబాబాద్ – విజయం న్యూస్)
ఉద్యమకారులు అందరూ కెసిఆర్ నీ వదిలి బయటికి రావాలని ఉద్యమకారులకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
మహుబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతుంటే ఒకే ఒక్కటి ఎస్సీ లకు ఇచ్చారని,ఎస్టీలకు ఒక్కరికీ ఇవ్వలేదని అన్నారు.మైనారిటలకు ఉన్నక్కోటిలాక్కొని వారి కళ్ళల్లో మట్టికొట్టారని అన్నారు.
కేసిఆర్ కి సామాజిక స్పృహ లేదు , సామాజిక న్యాయం చెయ్యరని అన్నారు. అడుగులకు మాడుగులోత్తే వారికి మాత్రమే పదవులు ఇస్తారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని విమ్మర్శించారు.
మన వర్గాల మీద కేసిఆర్ కి చులకన భావన ఉన్నదని, ఆచరణలో అది అర్దం అయ్యాక కేసిఆర్ తో ఉండవద్దని, ఉద్యమకారులు అందరూ కేసిఆర్ నీ వదిలి బయటికి రావాలని పిలుపు నిచ్చారు. బీజేపీ పార్టీ ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటుందని అన్నారు.
ALSO READ :-రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ..
ALSO READ :- రైతులకు కూసుమంచి పోలీసుల తోడు