Telugu News

పాఠశాలల్లో భవనాల పనులన్ని పూర్తి చేయాలి: కందాళ

ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సూచించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

0

పాఠశాలల్లో భవనాల పనులన్ని పూర్తి చేయాలి: కందాళ

== విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

== ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు సూచించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను త్వరతగతిన పూర్తి చేయాలని, అలాగే భవనాల నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి అయ్యే విధంగా చొరవ చూపాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఆదేశించారు. బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంలో మనఊరు-మనబడి పథకం క్రింద మంజూరైన పాఠశాల భవనాల నిర్మాణ పనుల పై కూసుమంచి, తిరుమలాయపాలేం మండలాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలను నెల రోజుల్లో తదిత్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.ఆ పాఠశాలకు  సంబంధించిన గ్రామ సర్పంచ్,ఎంపీటీసీ,  ప్రధానోపాధ్యాయులు ప్రతి ఒక్కరు భాగస్వాములై మన పాఠశాలలను బాగు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటరామాచారి, తిరుమలాయపాలెం మండలం నుండి 25 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు, ఎస్ఎంసి చైర్మన్లు, కూసుమంచి మండలం నుండి 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు, ఎస్ఎంసి చైర్మన్లు అదేవిధంగా రెండు మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డి.ఇ లు, ఏ.ఈ లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కూసుమంచి శివాలయం అభివద్దికి సహాకరిస్తాం: నామా, కందాళ