అలనాటి సంబురాల సందడేది…!
కనుమరుగవుతున్న సంక్రాంతి శోభ…..!
జాడలేని హరిదాసులు……..!
తగ్గిపోతున్న గంగిరెద్దులు….!
( గుండాల విజయం న్యూస్ )
సంక్రాంతి పండుగ వస్తుందంటే సందడి కనిపించేది.ప్రస్తుతం చూద్దామన్నా అలాంటి సంప్రదాయాలుఎక్కడా కనిపించడం లేదు…నేటి ఆధునిక యుగంలో పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన ప్రజలు పాతతరం అచ్చ తెలుగు సంసృతి, సాంప్రదాయాలకు మంగళం పాడుతున్నారు.మొదటి పండుగ శోభకి చాలా ప్రత్యేకత ఉంది.గోదావరి ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీరంగనాయక స్వామితో నిగ్రహం పొందినట్లుగా చెపుతూ సంప్రదాయంగా భోగి జరుపుకుంటారు.భోగి రోజు తెల్లవారుజామున లేచి ఇంట్లో ఉన్న పాత సామాన్లు,కర్రలను వేసి మంట పెడతారు. భోగి మంటల అనంతరం తైలంగాభ్యన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవుడిని పూజిస్తూ నైవేద్యం పెడతారు.సాయంత్రం పిల్లల మీద భోగిపండ్లు,శనగలు,పూలు,అక్షింతలతో ఆశీర్వదిస్తారు.
also read :-స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి… ఆదర్శం..
ఇలా చేయడం వలన నూతన సూర్యకాంతితో పిల్లలకు బుద్ధి వికాసం,ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు భావిస్తారు. రెండవ రోజు పండుగ సంక్రాంతి ఉత్తరాయాన పుణ్యకాలమైన సంక్రాంతి అంటే సూర్యుడు మఖరరాశిలోకి ప్రవేశించే రోజు.ఆనాటితో దక్షణాయానం ముగిసి ఉత్తరాయానం ప్రారంభమవుతుంది.ఇది మహాపుణ్యకాలమని,ఈ సమయంలో మరణించే వారు స్వర్గానికి వెళతారని భావిస్తు పితృదేవతలకు తర్పణం చేయడం,దానం చేయడం సంప్రదాయంగా ఎంచుకుంటారు.అంతేకాక ఏళ్లకాలం సుమంగలిగా ఉండాలని మహిళలు సుగంధ ద్రవ్యాలను దానం చేస్తారు.సంక్రాంతి రోజు చిన్నవారు పెద్దలకు దండం పెట్టి ఆశీర్వాదం పొందడం వలన దీనిని మొక్కుల పండుగ అని కూడా పిలుస్తారు. ఇక మూడవ రోజు జరుపుకునేది కర్షకులకు,రైతులకు ప్రీతిపాత్రమైన కనుమ. కనుమ సంక్రాంతి ఆనందాన్ని పశు పక్ష్యాదులు కూడా పొందాలన్న ఉద్దేశ్యంతో కనుమ రోజున వాటికి పూజ చేస్తారు…. హరిదాసూ…నీ జాడెక్కడ… హరిలో రంగహరి….శ్రీముద్రారామణ గోవిందా హరి…అంటూ భక్తిరస సాంప్రదాయాలతో రాగయుక్తంగా పాట పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో లయబద్దంగా చిందులు వేస్తూ సంక్రాంతి మాసంలో పల్లె వాకిట పలుకరించే హరిదాసులంటే తెలుగునాట తెలియని వారుండరు.ఇది ఒకప్పటి మాట… కానీ నేటి తరానికి వీరి గురించి లోగడ మనకు హరిదాసులుండేవారని తెలుసా అంటూ వివరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది…… జోష్ తగ్గిపోతుందా… ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇళ్ళ ముందు తెల్లారేసరికి హరిదాసులు దర్శనమిచ్చేవారు. కీర్తనలు ఆలపిస్తూ, జనాలను ఆనందపరిచేవారు.
also read :-కలహించుకుంటారా…?కలిసి నడుస్తారా…?
చేతిలో తంబురా, భజన చెక్కలు, మెడకు దండా, కాళ్ళకు గజ్జెలు, తలపై అక్షయపాత్ర పెట్టుకొని సినిమాలలో నారదునిలా కనిపించేవారు. హరిదాసులు తమ తంబురాను వాయిస్తూ, చేతిలోని చెక్కలతో భజన చేస్తూ ఇంటింటికి తిరిగుతూ కీర్తనలకు నాట్యం చేసేవారు. ఇంటిల్లిపాది చుట్టాలతో కలకలలాడుతూ సంబరాలు జరుపుకునేవారు. చిన్నారులు గాలి పటాలను ఎగుర వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. ప్రస్తుతం మాత్రం మారిన టెక్నాలజీ తో ఫోన్లను చేతబట్టుకొని పెద్ద వారి నుండి చిన్న వారి వరకు వాటిల్లో నిమగ్నమై పోవడం విచారకరమనే చెప్పొచ్చు.. ఇప్పటికైనా మానవ సంబంధాలకు విలువలను ఇస్తూ సాంప్రదాయ కళలను,కుల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది…….