Telugu News

అందరి చూపు ఆయన వైపే

నిన్న వద్దన్నరు..నేడు పక్కనే ఉంచుకుంటున్నరు..? ఏంటో సంగతి..?

0

అందరి చూపు ఆయన వైపే

== సీఎం పర్యటనలో స్పెషల్ అట్రాక్షన్

== నిన్న వద్దన్నరు..నేడు పక్కనే ఉంచుకుంటున్నరు..? ఏంటో సంగతి..?

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆయన సామాన్య నాయకుడు కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక వ్యక్తి.. ముగ్గురు సీఎం వద్ద మంత్రిగా పనిచేసి, 40ఏళ్ల రాజకీయ అనుభవం కల్గిన నాయకుడు.. ఐదుసార్లు గెలిచి అందులో మూడు సార్లు మంత్రిగా చేసిన అభివృద్ది ప్రధాత.. ఆయన ఎటుంటే అటు రాజకీయాలు మారిపోతాయి.. ఆయన రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవనానికి దూరం.. ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యం అలాంటి నాయకుడే మాజీ మంత్రి తమ్మల నాగేశ్వరరావు. ఆయన ఒక్క సారి ఓటమి చెందితే.. ఆయనపై అధిష్టానం సీతకన్ను చూపించింది. నిన్నటి వరకు ఆయన్ను పట్టించుకోలేదు.. కనీసం పార్టీ మీటింగ్ లకు, జిల్లా మీటింగ్ లకు కూడా ఆహ్వానించలేదు.. పార్టీ పదవుల్లో, ఎన్నికల్లో ఆయన అభిప్రాయాన్ని కూడా అడగలేదు..

allso read- తుమ్మలతో దోస్తి..

రాజ్యసభ, ఎమ్మెల్సీ టిక్కెట్ల ఎంపిక విషయంలో అతనేవ్వరో..? అన్నట్లుగా చూశారు.. ప్రచారానికి కూడా పిలవలేదు..ఆయన రాలేదు.. ఆయన వర్గీయులపై కేసులు, జైళ్లపాలు.. జైలు వద్ద ఆ నాయకుడి అర్తనాదాలు.. ఇంత జరిగింది.. చివరి ఎవరేన్ని చెప్పిన రాబోయే ఎన్నికల్లో పోటీ తథ్యం అని తెల్చి చెప్పిన ఆ నాయకుడ్ని కట్టిపుల్లతో తీసేసినట్లుగా తీసేశారు.. ఇక తెల్చుకోవాల్సిందేనని రంగంలోకి దిగిన ఆ నాయకుడు జనవరి 1న ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం నిర్వహించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ చేశారు.. మరో వైపు రాష్ట్ర రాజకీయాలనే మార్చగల్గిన నాయకుడు ఆత్మీయ సమ్మెళనం పెట్టి ఇక పో మీ పార్టీ వద్దు.. మీరు వద్దన్నట్లుగా మాట్లాడారు. నా సత్తా ఏంటో చూపిస్తానని బహిరంగ సవాల్ చేస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఉలిక్కిపడని పార్టీ అదిష్టానం.. ఖమ్మం జిల్లాపై కన్నేసింది.. ఏం జరిగిందంటే..?

ఎప్పుడులేనంత ప్రేమ ఉప్పొంగుతోంది.. ఎప్పుడు చూడనంతా అప్యాయత కనిపిస్తోంది.. వేదిక వద్దకే వద్దనుకున్న నాయకుడ్ని స్వయంగా సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిచి, వెంటపెట్టుకుని వేదికపైకి వెళ్లిన పరిస్థితి.. అంతేనా.. ఆ కార్యక్రమానికి హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విదేశాల నుంచి వచ్చిన ఆడబిడ్డ తల్లిదండ్రుల నుంచి ఎలా మురిచిపోతుందో..? తల్లిదండ్రులు ఎలా అప్యాయతానురాగాలను పంచుతారో అలా మంత్రి కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావును చూసి ఎన్నడు చూడలేదన్నంత ప్రేమను చూపించారు.

ALLSO READ- పొంగులేటికి ఊహించని షాక్..?

అప్యాయతను కనబర్చారు. చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తన్నీరు హారీష్ రావు నేరుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసం గండుగలపల్లికి వెళ్లాడు.. ఒక్కడే వెళ్లాడంటే అది కాదు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇటేవలే పదేపదే షెటేర్లు వేస్తూ రాజకీయ ప్రసంగం చేస్తూ సవాల్ చేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యేను కారులో ఎక్కించుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. అక్కడ చాలా సేపు రాజకీయ కబర్లు చెప్పుకున్నారు. నీ మాటే..మా మాట అన్నట్లుగా వ్యవహరించారు.

== బహిరంగ సభలో ఆయనే అట్రాక్షన్

ఖమ్మంజిల్లా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక దఫాలుగా వచ్చారు. సీఎం కీసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జస్ట్ కనిపించి చాలువ కప్పి సత్కరించే వెళ్లిపోయే తుమ్మల నాగేశ్వరరావు గురువారం భద్రాద్రికొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ను తుమ్మల నాగేశ్వరరావు వీడలేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఎలా సీఎంతో ఉన్నారో.. గురువారం జరిగిన కార్యక్రమంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు అలాగే ఉన్నారు.

ALLSO READ- ‘ఖమ్మం’ పై నేతల పోకస్

సీఎం కేసీఆర్ పదేపదే తుమ్మల, తుమ్మల అంటూ పిలవడం, పక్కనే నిలబెట్టించుకోవడం, పూజల వద్దకు, ప్రారంభం వద్దకు ఆయన్ను తీసుకొని సీఎం కేసీఆర్ వెళ్తుంటే తుమ్మల నాగేశ్వరరావు మరోసారి అందరికంట్లో పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రజలందరికి చూపు తుమ్మలపై పడింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది.. ఖమ్మం రాజకీయాలు ఎటువైపు దారి తీస్తున్నాయనే విషయంలో రాజకీయ నాయకులు అసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది…

== బీఆర్ఎస్ సభ కోసమేనా..?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీశ్ రావ్ తుమ్మల నాగేశ్వర్ రావ్ ఇంటికెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.సీఎం కేసీఆర్ పర్యటన రోజున ఆయన పక్కనే నిలబడటం, ఆయనతో కలిసి సీఎం నడవడం చూస్తుంటే  రానున్న రోజుల్లో తుమ్మలకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టేనా..? అనే చర్చజరుగుతోంది.. పాలేరు టిక్కెట్ ఇస్తానన్నారా..? లేదంటే బహిరంగ సభ సక్సెస్ వరకే కొంత రాజకీయ ప్రయోగం ఉపయోగిస్తున్నారా..? అనేది ఎవరికి అర్థం కావడంలేదనిపిస్తోంది.. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో..?