Telugu News

** అందరి చూపు ఖమ్మం వైపు.

** రేపు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

0

** అందరి చూపు ఖమ్మం వైపు
** రేపు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
** ఫలితాల కోసం ఉత్కంఠ ఎదురుచూపులు
** గెలుపుపై ఎవరిధీమా వారిదే
** అసక్తిగా మారిన ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. లెక్కింపు మిగిలిపోయింది.. ఈనెల 14న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.. ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడిపోతారో..? ఓట్ల లెక్కింపు తరువాత తెలనుంది.. అయితే ఈ లెక్కింపు కోసం యావత్తు రాష్ట్ర ప్రజలు ఖమ్మం వైపు చూస్తున్నారు. అత్యధిక ఓట్లు ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి తాతామధుసూధన్, అతితక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు బరిలో నిలవగా, ఎంపీటీసీల సంఘం నుంచి ఫోరం బాధ్యులు కొండపల్లి శ్రీనివాస్, అదివాసుల సంక్షేమంలో భాగంగా ఆదివాసి సంఘం బాద్యురాలు కొండ్రూ సుధారాణి బరిలో నిలిచారు.

అయితే ఈ ఎన్నికల్లో నలుగురు బరిలో ఉన్నప్పటికి ప్రధాన పోటి మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే మారింది. అసలు ముఖ్యంగా ఖమ్మంలో పోటీ ఉండదు ఏకగ్రీవం అవుతుందని అందరు భావించిన తరుణంలో ఉన్నట్టుగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో బరిలో నిలవడం, రాయల నాగేశ్వరరావు పోటీ చేయడం చకచక జరిగిపోయాయి. అయినప్పటికి టీఆర్ఎస్ సుమారు 450కిపైగా మెజారిటీ ఓట్లు ఉన్నాయిలే, సాదాసీధాగా ఎన్నిక ముగిసిపోతుందని అందరు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు మాత్రం కాలు దువ్వి రంకేలేశారు. బస్తిమే సవాల్ అంటూ అధికార పార్టీకే సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను క్యాంఫ్ కు తరలించి నువ్వా..నేనా..? అంటా సవాల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కలిసి మాట్లాడి వారి పనుల్లో నిమగ్నమైయ్యారు. దీంతో అప్పటి వరకు ఈజీగా తీసుకున్న అధికార పార్టీ ఆ తరువాత స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతామధుసూధన్, రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగి ఎన్నికలకు సమయత్తమైయ్యారు.

ఉమ్మడి జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను గోవాకు క్యాంఫ్ కు తరలించారు. ప్రజాప్రతినిధులకు కోట్లరూపాయలను ఖర్చు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు క్రాస్ కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజున చాలా జాగ్రత్తగా రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్త చర్యలు తీసుకొని ఓటర్లకు సూచనలు, సలహాలను అందించి ఓట్లు వేయించారు. ఏ మాత్రం క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కానీ…? ఈనెల 10 పోలింగ్ జరగ్గా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని టీవీలు, పత్రికల్లో ప్రధాన శీర్చికగా కథనాలు వచ్చాయి.. ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ జరిగింది.. టీఆర్ఎస్ పార్టీ విజయం కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని మీడియా ప్రతినిధులు కూడా ప్రత్యేక కథనాలు ప్రచురితం చేశారు. దీంతో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై అసక్తి పెరిగింది. కాగా అందరి చూపు ఖమ్మ వైపు ఖమ్మం వైపు మల్లింది. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతోందనని యావత్తు తెలంగాణ రాష్రంతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు ఖమ్మం వైపు చూస్తున్నారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరు గెలుస్తారు..? క్రాస్ ఓటింగ్ జరిగిందా..? జరిగితే ఎన్ని ఓట్లు జరిగాయి…? ఏ పార్టీ వారు క్రాస్ వేశారు..? ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగిందనే అంశాలపై గాలిలో లెక్కలు వేసే పనిలో నిమగ్నమైయ్యారు.. కొన్ని చోట్ల పంద్యాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకులు పదేపదే ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై అసక్తికరమైన చర్య పెడుతున్నారు.

అనేక టీవీ చానల్స్ లో కూడా ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా..? అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. అలాగే ఇంటిలిజెన్సీ రాష్ర్ట స్థాయి అధికారులు ఖమ్మం జిల్లాలో పర్యటించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగిందా..? జరిగితే ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి క్రాస్ ఓట్లు పడ్డాయి.. పడితే ఎన్ని ఓట్లు క్రాస్ జరిగింది..? ఏఏ సభ్యులు క్రాస్ చేశారనే అంశాలపై జిల్లా ఇంటిలిజెన్సీ అధికారులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పక్కా సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా తాతా మధు సూధన్ గెలిచే అవకాశం ఉందని, కానీ క్రాస్ ఓటింగ్ మాత్రం జరిగి ఉండోచ్చని ఇంటిలిజెన్సీ అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు విశ్వసనీయ సమాచారం. అది ఎంత వరకు నిజమే తెలియదు కానీ.. జరిగిన వాస్తవం అయితే అదే అన్నట్లు పలువురు భావిస్తున్నారు.
** ఎవరికి వారిలో గెలుపుధీమా..?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమంటే మేమే గెలుస్తామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారే గెలుపుధీమాను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కూడా ఒక వైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ ఎన్నిక వచ్చిన గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని, క్రాస్ బీడింగ్ లు వచ్చేయి వస్తాయి.. పోయేయి పోతాయి కానీ గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి చరిత్రను తిరగరాయబోతున్నామని చెబుతున్నారు. ఇలా ఎవరికివారే గెలుస్తామని చెబుతున్నప్పటికి అది మేకపోతు గాంభీర్యమేనని, ఎవరి భయం వారికే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితమేలా ఉన్నా..? కాంగ్రెస్ పార్టీకి మాత్రం నూతన ఉత్సహాన్ని తీసుకొచ్చే విధంగానే కనిపిస్తోంది..? మొత్తానికి ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితంపై యావత్తు తెలుగు రాష్ట్రప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు..? మరీ ఈనెల 14న జరిగే కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడతారో..? వేచి చూడాల్సిందే..?

also read ;-ఓటర్ల తీర్పు ఎటు.. షూరు అయిన పోలింగ్