Telugu News

సకల సదుపాయలతో కార్పొరేషన్ కార్యాలయం : మంత్రి పువ్వాడ

◆ పూర్తి కావచ్చిన నిర్మాణ పనులు.

0

సకల సదుపాయలతో కార్పొరేషన్ కార్యాలయం : మంత్రి పువ్వాడ
◆ పూర్తి కావచ్చిన నిర్మాణ పనులు..
◆ త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిచే ప్రారంభోత్సవం.
◆ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.21 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భవన నిర్మాణ పనులను శుక్రవారం మంత్రి పువ్వాడ పరిశీలించారు.

అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయం తర్వాత ఖమ్మం లోనే ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కార్యాలయా నిర్మాణ పనులు మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

also read;-రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్
అతిత్వరలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని మంత్రి పువ్వాడ వెల్లడించారు. రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు తెలిపారు.

also read;-పుతిన్‌కు మ‌రో షాక్‌… ఉక్రెయిన్‌లోని ర‌ష్య‌న్ల ఆస్తుల సీజ్
నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని, ఈ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని, గ్రేటర్‌ తరహాలో కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ కృష్ణాలాల్, డీఈ రంగారావు, కార్పొరేటర్లు తదితరులు అన్నారు