Telugu News

పొమ్మనలేక..? ** ఆ పని చేసింది ఆయనేనంటా..? అందరి నోట అదేమాట

** ఆయన వైపే వేళ్లన్ని..? టైమ్ కోసం ఎదురుచూపు..?

0

పొమ్మనలేక..?
** ఆ పని చేసింది ఆయనేనంటా..? అందరి నోట అదేమాట
** ఆయన వైపే వేళ్లన్ని..? టైమ్ కోసం ఎదురుచూపు..?
** అందుకు విరుద్దంగా ఇంటిలిజెన్సీ నివేదక..?
** అంతర్మథనంలో వర్గీయులు.. వేచి చూస్తున్న ఆ నేత..?
** అవమానమేందుకు బయటకపోదాం అంటున్న ఆయన వర్గీయులు..?
** ఖమ్మంలో రసవత్తరంగా మారుతున్న రాజకీయ పరిణామాలు..
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం రాజకీయాల్లో పెనుమార్పులు జరగబోతున్నాయా..? ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు కారణం అతనేనా..? అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయా..? అందరు ఐక్యమై అదినేతకు ఫిర్యాదు చేశారా..? ఆయనుంటే మనకు ఇబ్బందని చెప్పకనే చెప్పారా..? ఆయనేందుకు నిశబ్ధంగా ఉంటున్నారు..? తప్పు జరిగిందా..? తప్పుడు ప్రచారమా..? నేతల ఇచ్చిన ఫిర్యాదుకు..ఇంటిలిజెన్సీ సమాచారంకు తేడా ఉందా..? అంటే నూటికి నూరుశాతం నిజమేని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై ఖమ్మం టీఆర్ఎస్ పార్టీలో అంతర్ యుద్దం కొనసాగుతూనే ఉంది.. అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించారే కానీ.. ఊహించని విధంగా ఓటింగ్ నమోదు కావడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది..

అందుకు కారణం ఆ ఒక్కడేనంటూ ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.. అందుకే కచ్చితంగా క్రాస్ ఓటింగ్ పడిందని పార్టీలో విస్త్రత్తంగా ప్రచారం జరుగుతోంది.. అందరి కండ్లు.. అందరి వేళ్లు ఆయనవైపే చూపిస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది.. ఆయనపైనే అధినేతకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది.. అందుకే అందరితో రాజదానికి ఆయనేందుకు వెళ్లలేదని, అసలు పిలవలేదనే ప్రచారం జోరుగా జరుగుతుంది.. అసలు ఆయన నిజంగా క్రాస్ ఓటింగ్ వేయించాడా..? కావాలనే సందు దొరికింది కాబట్టి అదేదో చేసినట్లు చేసేందుకు ప్రయత్నం జరుగుతుందా..? ఖమ్మం అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? ’విజయం‘ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం..

ALLSO READ :- ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ.

ఖమ్మం రాజకీయ రణరంగం షూరు అయ్యింది.. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నప్పటికి ఇప్పటి నుంచే రాజకీయ చదరగం ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రారంభమైంది.. పెనుమార్పులు ముహుర్తం పెట్టుకున్నట్లైంది.. క్రాస్ ఓటింగ్ ఎవరిబాధ్యత అంటే ఇదిగో ఆయన బాధ్యతేనంటూ వేలేత్తి చూపించే పరిస్థితికి వచ్చింది.. అందుకోసం కొందరు నేతలు ఐక్యమై అధినేతకు నేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఆ నేత వల్ల మనకు ఇబ్బందులు తప్పవని, ప్రతిసారి తలనొప్పిగా మారుతున్నాడని ఆ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పోరపాట్లు చేయడం వల్లనే 9అసెంబ్లీ సీట్లు ఓడిపోయామని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని భవిష్యత్ ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ నేతలు అదినేతకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.. ఇంతకు అతనేవ్వరు..? పూర్తి వివరాల్లోకి వెళ్దాం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పూర్తి బలంగా ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2015లో టీఆర్ ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ పార్టీకి తిరుగేలేదని అందరు భావించారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివద్ధి చేశారు. అయినప్పటికి 2018డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలకు 9 స్థానాలు ఓటమిచెందాయి. ఖమ్మం అసెంబ్లీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. మంత్రివర్గంలోనే అత్యంత పేరుగాంచిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓటమి చెందారు. దీంతో యావత్తు రాష్ట్రమే అశ్ఛర్యపడింది. అంతేకాదు స్వయంగా సీఎం కేసీఆర్ ఆశ్ఛర్యపోయి మా వాళ్లే ఓడించుకున్నారని అన్నారు. దీంతో కండ్లన్ని, వేళ్లన్ని ఆ ఒక్క నేత వైపే చూపించాయి.. అనంతరం కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎన్నికలు రావడం.. ఎవరు ఊహించని విధంగా నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరడం ఎంపీ టిక్కెట్ ను ఆయనకు కేటాయించడం చకచక జరిగిపోయాయి.
** ఆనాడే అనుమానించారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు ఓడిపోవడానికి కారణం ఆ నాయకుడేనని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ నేతపై అదినేతకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయనే కావాలని ప్రత్యర్థులకు డబ్బులు ఎదురిచ్చి ఓడించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.. స్వయంగా శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు అధినేతకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఆ నేతకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. సమయం కోసం చూసి, ఆ సమయం రాగానే అనుకున్నది చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు దక్కాల్సిన స్థానంలో మరోకరికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చినట్లు ఆనాడు ముమ్మరంగా ప్రచారం జరిగింది.
** పదవి దక్కపోవడానికి కారణం అదేనా..?
స్థానిక సంస్థలు, పంచాయతీల ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా ఆ నేత అధికార పార్టీకి అన్యాయం చేసిండే ప్రచారం జరుగుతోంది.. ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన పిలిచి మరి పైసలు ఇచ్చాడనే ప్రచారం జరిగింది.. ఆ విషయంలో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు అధినేతకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. అందుకు ఆ నేత అనేక కారణాలు చెప్పినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని అధినేత సీరియస్ గానే తీసుకున్నట్లు జరిగిన పరిణామాలను భట్టే తెలుస్తోంది..

ALLSO READ :- యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడ కొనలేము.

అందుకే పదవిలేకుండా పార్టీలో కొనసాగుతున్న ఆ నేతకు ప్రతిసారి పరాభవం జరుగుతూనే ఉంది.. దేశరాజకీయాలలో ఉండాల్సిన అతను రాష్ట్ర రాజకీయాల వైపు చూసే విధంగా కేసీఆర్ తయారు చేశారనే పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు.. శాసనమండలిలో అవకాశం దక్కుతుందేమోనని..? మంత్రి వర్గంలో చోటు లభిస్తుందేమోనని..? ఊరించిఊరించి ఊరడించిన పరిస్థితి ఖమ్మం లో జరుగుతుంది..? పార్టీ కోసం పనిచేయకుండా పక్కచూపులు చూస్తున్నారనే విమ్మర్శులు వస్తున్నాయి..
** క్రాస్ ఓటింగ్ చేసిందాయనేనా..?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితం అధికార పార్టీకి షాక్ నిచ్చింది. భారీగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ క్రాస్ అయ్యాయి.. సుమారు 100 మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి తాతామధుసూధన్, ఎమ్మెల్ల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. రెండు రోజుల్లోనే అందరు కలిసి హైదరాబాద్ కు వెళ్లి అధినేతకు ఆ నేతపైనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. కచ్చితంగా ఓట్లు క్రాస్ చేశారని తద్వారానే భారీ మెజారిటీతో గెలవాల్సిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చాయని, ఆయనుంటే రాబోయే రోజుల్లో పార్టీ నష్టపోతుందని, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉందని నేతలు ఆ నాయకుడిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆయన్నే అనుమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతల వేళ్లన్ని ఆయన వైపే చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఆ విషయంపై స్పందించలేదన్నట్లుగా తెలుస్తోంది.. అయితే సస్పెండ్ చేస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్న అధినేత, ఆయనై ఆయనే వెళ్లిపోతే బెటర్ అన్నట్లుగా పొమ్మనలేక పోగపెడుతున్నట్లు పరిస్థితులు ప్రభావం చూపిస్తోంది. నిజంగా ఆయన క్రాస్ చేయించారా..? అంటే..?
** ఇంటిలిజెన్సీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి..?
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ ఫలితం పై ఇంటిలిజెన్సీ అధికారులు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఒక నివిదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.. అందులో కాంగ్రెస్ అభ్యర్థి పై ఉన్న మంచిపేరు, నిధులు, విధులు లేకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక, కొంత డబ్బులు ముట్టిన విషయంలో వారికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే మా నాయకుడికి పదవులు ఇవ్వకుండా నాన్చుతున్నారనే కోపంతో ఓటర్లు తమ స్వంతంగా నిర్ణయించుకుని క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఇంటిలిజెన్సీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది… క్రాస్ ఓటింగ్ విషయంలో ఆ నాయకుడి ప్రమేయం ఎక్కడ లేదని నివేదికలో పొందపర్చినట్లు సమాచారం.
** అంతర్మథనంలో ఆయన వర్గీయులు
ఎన్నికలు జరిగినప్పుడళ్లా టీఆర్ఎస్ పార్టీకి జరిగే పరాభావం విషయంలో ఆ నాయకుడి పాత్ర ఉందని ముఖ్యనేతలందరు వేలేత్తి చూపించే పరిస్థితి పై ఆ నాయకుడి వర్గీయులు కొంత అసంతప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సారి అవమానిస్తూ మాట్లాడుతున్నారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానం ఉన్న మా నేత ఎందుకు అవమానాలను ఎదుర్కుంటున్నాడని పలువురు భాదపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది నాయకులు నేరుగా ఆ నాయకుడ్ని కలిసి మనకు ఈ పార్టీ అవసరం లేదు.. కాంగ్రెస్ పార్టీలోకి లేదంటే వైసీపీ పార్టీలోకి వెళ్లిపోదామని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జరిగే పరిణామాలను ఈజీగా తీసుకుంటున్న ఆ నాయకుడు కొంత అంతర్మథనంలో పడిపోయినట్లు సమాచారం. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..? ఆ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో..?
( అంతర్మథనంలో ఉన్న నేత ఆ పార్టీకి టచ్ లో ఉన్నారా..? రేపటి సంచికలో..?

also read :-ఏ ఒక్క టీచర్ కు అన్యాయం జరిగిన ఊరుకోం… ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట పీఆర్ టీయు ధర్నా