Telugu News

ఖమ్మం మార్కెట్ చైర్మన్ కు వినతి

బంద్ కు సహాకరించాలని కోరిన అఖిలపక్షం

0

 

27న బంద్ కు సహాకరించండి

** ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కి వినతి చేసిన అఖిలపక్షం

(ఖమ్మం- విజయం న్యూస్)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న 19 రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన సంఘాలు తదితరులు తలపెట్టిన భారత్ బంద్ లో భాగస్వామ్యం అయి భారత్ బంద్ కు సహకరించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకత్వం గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం దోచి పెడుతుందని, భారతమాతని అమ్మకానికి పెడుతుందని, అనేక పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న భారతదేశాన్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టడమే ధ్యేయంగా బీజేపీ పాలన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమాత్రం తీసిపోని పద్ధతిలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వ పాలన కొనసాగించాలని చూస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ లో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావడం ద్వారా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

also read : మణుగూరులో రూ.2.90కోట్ల భారీ కుంబకోణం
ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, కాంగ్రెస్, టిడిపి పార్టీల జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు, పువాళ్ల దుర్గాప్రసాద్, యస్ కె జానీ మీయా, కందిబండ నరసింహారావు, ఎర్ర శ్రీకాంత్, పుచ్చకాయల వీరభద్రం, ఎర్ర శ్రీనివాస రావు, తుశాకుల లింగయ్య, నూనె శశి, బండారు యాకయ్య, దిరిశాల వెంకటేశ్వర్లు, బజ్జు రమణారెడ్డి, కల్వకుంట్ల గోపాల్, సోమారపు సుధీర్, నల్లమోతు లక్ష్మయ్య, కైలాసపు వేణు, బొల్లేపల్లి సత్యనారాయణ, పల్లా లింగయ్య, అంకిత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
also read : నడిరోడ్డుపై వెలిసిన ఎండిన మొక్క