Telugu News

ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ : భట్టి విక్రమార్క

* ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా అవిర్భవదినోత్సవ వేడుకలు

0

ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ : భట్టి విక్రమార్క

** ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా అవిర్భవదినోత్సవ వేడుకలు
** జెండాను అవిష్కరించిన భట్టి, దుర్గప్రసాద్
** సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను సన్మానించిన సీఎల్పీ నేత భట్టి

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ అని సీఎల్పీనేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.
137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పోరాట ఫలితమే దేశానికి సిద్ధించిన స్వాతంత్రం, భారత రాజ్యాంగం. దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు చేస్తున్న కుట్ర మోడీ సర్కార్ రాజ్యాంగం అమలు చేయకుండా కుట్ర పూరితంగా చేస్తున్న పాలనే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ అనేక త్యాగాలతో ప్రజలకు అందించిన ఫలాలను, ఫలితాలను నేటి పాలకులు దూరం చేస్తున్నారు.
పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టులు, మిశ్రమ ఆర్థిక విధానాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఫలాలను వాటి ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ దారాదత్తం చేస్తున్నది.యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు.కాంగ్రెస్ పార్టీ ,రైతులు చేసిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలన్న కుట్రలో భాగమే ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటన.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండ చేస్తున్న రాజకీయంతో విసిగి వేసారిన రైతులు వారి భూములను తామంతట తామే కార్పొరేట్ శక్తులకు లీజుకు అప్పగించాలన్న కుట్రలో భాగంగానే పరోక్షంగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుతున్న రాక్షస క్రీడ.
దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల పైనే ఉందని పిలుపు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాధవ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొడ్డ సౌజన్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నాయకులు రాందాస్ నాయక్, బాలగంగాధర్ తిలక్, కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

also read :-★ భారత దేశంలో మత సామరస్యానికి ప్రమాద ఘంటికలు