మంత్రి పువ్వాడ పై మువ్వా విజయ్ పైర్
== జిగేల్ అనిపించేదంతా అభివృద్ధి కాదు..! : మువ్వా విజయ్
== తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యం
== జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు
== మూడవ డివిజన్ లో కొనసాగిన గడప గడపకు కాంగ్రెస్
(ఖమ్మం-విజయంన్యూస్):
జిగేల్ అనిపించేలా నాలుగు వీధిలైట్లు ఏర్పాటు చేయడం…. మూడు రోడ్లు వేయడం…. ఒకటి రెండు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం అభివృద్ధి కాదని జిల్లా కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు పేర్కొన్నారు. మూడవ డివిజన్ లో బుధవారం ప్రారంభమైన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం గురువారం కూడా కొనసాగింది. డివిజన్ లోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. ఎంతోమంది అర్హులున్నా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇవ్వడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇళ్లు లేని నిరుపేదలందరికీ రూ. ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారందికీ రూ.4వేల పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వాదించాలని స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్, నాయకులు మందడపు తిరుమలరావు, బోడా శ్రావణ్ కుమార్, చంద్రం, కాంపాటి వెంకన్న, నరాల నరేష్, మాలోత్ రాము తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?