Telugu News

 రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా ఉండాలి: మంత్రి పువ్వాడ

2023-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ

0

 రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా ఉండాలి: మంత్రి పువ్వాడ

== 2023-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ

(ఖమ్మం-విజయంన్యూస్)

నూతన సంవత్సరం-2023 పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ,సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానని తెలిపారు.కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఈ నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధిస్తుంది అని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని,బంగారు తెలంగాణ గా అడుగులు వేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆ భగవంతుడు 2023-నూతన ఏడాది మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు  వెల్లడించారు.పుష్కలంగా వర్షాలు కురిసినందున పాడిపంటలకు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నదని, ప్రజలు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడానికి ఆలోచించాలని, రైతులు మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నామన్నారు.కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని, ఎంచుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఆశిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: 2023 కు స్వాగతం..సుస్వాగతం