– నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు
– ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
(ఇచ్చోడ విజయం న్యూస్) :-
మండల కేంద్రము లోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నలభై వసంతాల క్రితం 1982- 83 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో 1982-83 సంవత్సరంలో పదవ తరగతి చదివిన సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు మరియు వీరికి విద్య నేర్పిన 10 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కటి జ్ఞాపకాలను , అనుభవాలను నెమరు వేసుకున్నారు.మొదటగా జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతం ఆలాపన అలాగే తమను వదిలి శాశ్వతంగా వెళ్లిపోయిన తోటి సహా విద్యార్థుల మరియు ఉపాధ్యాయులకు మౌన శ్రద్ధాంజలి ఘటించారు.
also read :-టైలర్స్ అసోసియన్ సమావేశానికి హాజరైన రేగా..
అనంతరం ఈ బ్యాచ్ విద్యార్థుల వ్యక్తిగత పరిచయం,ఉపాధ్యాయుల ప్రసంగాలు,ఉపాధ్యాయులకు శాలువా,మేమొంటో లతో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.పలువురు ఉపాధ్యాయులు పురుషోత్తం,ఖాజామియా లు చక్కటి కవితలు చక్కటి పాటలు పాడి ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని మంత్ర ముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమంలో అంజలి, శంకర్,సుదర్శన్, కత్తురి ఆనంద్ కుమార్, మోహన్ రెడ్డి,సురేందర్ రెడ్డి, మోయిన్,అబ్దుల్ శఫిక్, జాదవ్ వెంకట్రావ్, గంగారం,రాజమణి తదితరులు పాల్గొన్నారు.