Telugu News

తెలంగాణాలో అద్భుత ప్రగతి : నల్లమల

ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో లబ్ది

0
తెలంగాణాలో అద్భుత ప్రగతి : నల్లమల
==  ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో లబ్ది
== కేసీఆర్ కు అండగా ఉండాలి
== ఎంపీ నామ  క్యాంప్ కార్యాలయంలో జరిగిన  సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు
 

 ఖమ్మం, జూన్ 02(విజయంన్యూస్):
 కేసీఆర్ పాలనలో తెలంగాణా రాష్ట్రం అద్భుత అభివృద్ధిని సాధించి, రికార్డులు సృష్టిస్తూ దేశాన్ని ఆచరింపజేస్తుందని  రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో   ఖమ్మం రూరల్ మండలం అరేకోడు , గోళ్లపాడు, కాచిరాజుగూడెం, తెల్దారుపల్లి, తీర్థాల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు  మంజూరైన రూ. 1,58,000  విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నల్లమల పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ తో   కలసి లబ్దిదారులకు  అందజేశారు.
ఈ సందర్భంగా నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా పేదలకు పార్టీలకతీతంగా సీఎంఆర్ఎఫ్ సాయం పెద్ద ఎత్తున అందుతుందని అన్నారు. ఈ పధకం ఆర్థిక స్తోమతలేని పేదలకు వరంగా  మారిందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందుతుందని అన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని అన్నారు.రాష్ట్రాన్ని అబ్బురపరిచే రీతిలో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా ఉండి, మళ్లీ గెలిపించుకొని  ,మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. మళ్లీ కేసీఆర్ మూడోసారి సీఎం కావడం  ఖాయమని , ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో  కేసీఆర్ ను, నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణాను దేశానికే డిక్చూచిగా చేసిన కేసీఆర్ నాయకత్వం వైపు నేడు  యావత్ దేశం ఎదురు చూస్తోందని నల్లమల అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ ,  జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్,  పార్టీ పల్లెగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు జర్పుల వెంకటేష్ , రూరల్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కోమరబత్తిని  మురళి, పార్టీ నాయకులు గొడ్డేటి మాధవరావు, నామ సేవా సుమితి బాధ్యులు చీకటి రాంబాబు, మునిగంటి భార్గవ్   తదితరులు పాల్గొన్నారు