Telugu News

అంబరాన్నంటిన సంబురం

== ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

0

అంబరాన్నంటిన సంబురం
== ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
– ఆనందాల హోరు, నృత్యాల జోరు
-ఇళ్ల ముందు రంగవల్లులు, ఆలయాల్లో పూజలు
== అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. అక్కడక్కడ ప్రమాదాలు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఆనందాల హోరు.. డ్యాన్స్ ల జోరు..మధ్యం కోసం బారులు.. రోడ్లపై చికారులు..పోలీసుల పైర్.. ఇళ్లముందు రంగవల్లులు.. ఇంటిళ్లపాది సంబురాలు.. అక్కడక్కడ అప్పల చప్పళ్లు.. ఆలయాల్లో పూజలు.. కళకళలాడిన దేవాలయాలు.. ఖాళీ అయిన రోడ్లు.. వేరసి అంబురాన్ని అంటిన నూతన సంవత్సర సంబురాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం రాత్రి 12:00 వరకు మెలకువగా ఉండి 2021కి వీడ్కోలు పలుకుతూ.. జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటు 2022 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ దివ్వెల వెలుగుల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం తెల్లవారు జామున మహిళలు ఇళ్ల ముందు వేసిన రంగురంగుల అందమైన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఇంటిళ్లపాది కొత్తబట్టలతో ఇంటికే పరిమితమై సందడి చేశారు.. కుటుంబమంతా ఆనందోత్సవాలలో మునిగిపోయారు.

== 31న ప్రారంభమైన యువకుల సందడి
డిసెంబర్ 31 నుంచే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైయ్యాయి. 2021 సంవత్సరానికి వీడుకోలు చెప్పేందుకు గాను యువకులు సందడి చేశారు. ఉదయం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు యువకులు సందడి చేశారు. కేరింతలు కొడుతూ హ్యాఫీ న్యూయర్ అంటూ సందడేసందడి చేశారు. నయా జోష్ కనిపించింది.. ఇక బార్, రెస్టారేంట్లు పుల్ రద్దీగా కనిపించాయి. చాలా మంది స్నేహితులు, మిత్రులు, క్లాస్ మెంట్స్ ఒక గూటిగా చేరి పార్టీలు చేసుకున్నారు. అర్థరాత్రి 12గంటలకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త సంవత్సరంలో మొదటి రోజు కూడా గ్రామాల్లో కేక్ ల అమ్మకాలు కొనసాగాయి. అంతా కూడా 2022 సంవత్సరానికి ఆహ్వానం పలికిన క్షణాలను అనందంగా పంచుకున్నారు.


== రద్ధీగా ఆలయాలు
నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి..
నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లో అందరికీ మంచి జరగాలని కోరుతూ రోజంతా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దేవాలయాలతో భక్తి క్షేత్రాలలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు.


== పోలీసుల సంబరాలు.. రోడ్డుపై కేక్ కట్ చేసిన సీపీ
ఖమ్మం నగరంలో పోలీసులు నూతన సంవత్సర వేడుక లు నిర్వహించారు. చిన్నారులు, యువకుల సమక్షంలో కేక్ కట్ చేసి కేక్ అంతా కలిసి సంతోషంగా గడిపారు. నడిరోడ్డుపై ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ లు, సిబ్బంది కలిసి కేక్ కట్ చేశారు. సీపీకి చిన్నారులు కేక్ ను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏసీపీలు, సీఐలు కేక్ అందించుకుని పసర్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీపీ విష్ణుఎస్.వారియర్ కు ఏసీపీలు శుభాకాంక్షలు చెబుతూ మొక్కలను అందించారు.


== కలెక్టర్ కు శుభాకాంక్షల వెల్లువ
ఖమ్మం కలెక్టర్ కు నూనత సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. సుమారు మధ్యాహ్నం వరకు కలెక్టర్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేస్తూ, బుకేలను అందిస్తూ, మెమోంటోలను అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ :-ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పై మంత్రి పువ్వాడ సమీక్ష..