బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష…
* అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండు ..
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష…
* అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండు ..
* రాజ్యాంగ విలువలు గుర్తించని, గౌరవించని కెసిఆర్ ముఖ్యమంత్రికి అనర్హుడు..!?
* బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలి.
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణరెడ్డి
బడ్జెట్ సమావేశాలు మొత్తం బిజెపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఇట్టి దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం పెట్టిన బిక్ష తో అనేక పదవులు అనుభవించి, చివరికి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవి కూడా తన ఎడమ కాలి చెప్పు తో సమానం అని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఇటీవల అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్పు చేయాలని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు
also read;-ప్రజారంజక బడ్జెట్ : నామా
అందుకు తగిన విధంగానే కెసిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, కెసిఆర్ సర్కార్ తన సొంత రాజ్యాంగాన్ని తెలంగాణ లో అమలుపరచాలనుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. మహిళా గవర్నర్ తమిళిసై పట్ల వ్యవహరించిన తీరు, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పట్ల టిఆర్ఎస్ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, కెసిఆర్ సర్కార్ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ విలువలు గుర్తించని, గౌరవించని వ్యక్తి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ వ్యతిరేకిగా మారిన అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మతిభ్రమించి మాట్లాడటమే కాకుండా రాష్ట్రంలో చట్టాలను చుట్టాలుగా మార్చుకుని ,సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే చేపట్టడం, బడ్జెట్ సెషన్ మొత్తం బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కెసిఆర్ రాజకీయ జీవితంలో తనకు రాజ్యాంగం పెట్టిన బిక్ష తో ఎన్నో పదవులు అనుభవించి నేడు అదే రాజ్యాంగాన్ని కెసిఆర్ అపహాస్యం చేస్తున్నారని తెలిపారు.
also read ;-ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మిన్నంటిన సంబరాలు.
ముఖ్యమంత్రి పదవి స్వీకరించేటప్పుడు కెసిఆర్ రాజ్యాంగ పై ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రజలకు వాగ్దానం చేసి నేడు ఆ రాజ్యాంగాన్నే మార్చాలని వ్యాఖ్యానించడం, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబించడం కెసిఆర్ నీతి మాలినతనానికి నిదర్శనం లాంటిదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికైనా తన పద్ధతులు మార్చుకోవాలని , రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసి రాజ్యాంగ విలువలను కాపాడి, గౌరవించి, బిజెపి ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.